• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Advaita Vedanta Parichayam

Advaita Vedanta Parichayam By Kasturi Rajya Sri

₹ 150

స్వామీజీ గురించి నా స్పందన

గురుర్ర్బహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః

కొన్నేళ్ళ క్రితం మావారు ఎప్పుడు చూసినా ఒక స్వామీజీ ప్రసంగాలు వింటూ ఉండేవారు. కొన్ని గుళ్ళలో వేదఘోష ప్రతిధ్వనిస్తున్నట్లుగా, మా ఇంట్లో ఇటుక, ఇటుకకూ ఆ స్వామీజీ గొంతు సుపరిచితమే. ఏం వింటున్నారు అంటే అద్వైతవేదాంతం అనేవారు. కొంత కాలం ఏమోలే, నాకేం అర్థమవుతుందని పట్టించుకోలేదు. కాని, ఒక శుభముహుర్తాన (నిజంగా అది శుభముహుర్తమే) ఎందుకో నాకూ అదేమిటో వినాలన్న కుతూహలం కలిగింది. ఆ మాట చెప్పిందే తడవుగా, నా సెల్ఫోన్లో ఆయన ప్రసంగం ఒకటి ఎక్కించి ఇచ్చారు.

అన్నట్లు అది ప్రసంగం కాదు, బోధట. గురుశాస్త్ర ఉపదేశంట. నేను ఇంగ్లీషు లెక్చరర్గా మా పిల్లలకి క్లాసులో రోజుకో గంట ఎలా బోధిస్తానో, అలా రోజుకో గంట శ్రద్ధగా ఆయన ఉపన్యాసం వినమన్నారు. దానిపేరు ముండకోపనిషత్తు. అది వినేనాటికి నాకు అసలు అద్వైతం అంటే ఏమిటో తెలియదు. ఉపనిషత్తు, ఆత్మ, అనాత్మ, శరీరత్రయం, పంచకోశాలు, కర్మసిద్ధాంతం ఇలాంటి పదాలతో బొత్తిగా పరిచయం లేదు.

అలాటి అజ్ఞానంతో ఉన్న నేను ముండకోపనిషత్తు వినటం మొదలుపెట్టాను. ఆ స్వామీజీ పేరు పరమార్థానందస్వామి. పూజ్యస్వామీజీ దయానందసరస్వతిగారి శిష్యులాయన. ఎంత బాగా చెప్పారనుకున్నారు! ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే! అసలేమీ తెలియని ప్రపంచంలోకి, స్వయంగా మన చేయి పట్టుకుని, ఒక్కొక్కమెట్టూ పైకి ఎక్కించి, ఎక్కడ జారిపోతామో అని మధ్య మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటూ, పైకి తీసుకువెళ్ళి ఒక అద్భుతప్రపంచం చూపించారు.

అసలే కొత్త విషయం, తలపైనుంచి వెళ్ళిపోయే వివరాలు. అయినా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు, ఊహూ! నోట్లో పెట్టి, అది మింగేదాకా ఆగినట్టు ఆగేవారు. ఒక్కో విషయం ఒకటికి రెండుసార్లు చెప్పటం, చెప్పబోయే విషయానికి కొంత ఉపోద్ఘాతం ఇచ్చి, మళ్ళీ ఒక్కొక్క మంత్రంలోని ఒక్కొక్క పదానికి అర్థం, గూడార్థం చెప్పి, మళ్ళీ దానికి ముక్తాయింపు పలకటం, మర్నాడు పది నిముషాలు పాతపాఠాన్ని గుర్తుచేయటం - టూకీగా ఇదీ ఆయన పద్ధతి. ఇదంతా ఇంగ్లీషులో. ఇంగ్లీషు రానివారికి కూడా అర్థమయ్యేటంత తేలిక పరిభాషలో. సరిగ్గా మనకు ఒక విషయం అర్థం కాక, అమ్మో అనుకునే సమయానికి తల తిరుగుతోందా అని అరవంలో అడుగుతారు. మళ్ళీ దాన్ని తేలిక భాషలో ఇంకో విధంగా చెబుతారు...............

  • Title :Advaita Vedanta Parichayam
  • Author :Kasturi Rajya Sri
  • Publisher :K V Ranga Rao
  • ISBN :MANIMN5467
  • Published Date :2023
  • Number Of Pages :123
  • Language :Telugu
  • Availability :instock