ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని తీవ్రంగా ప్రేమించింది!
ఎంత తీవ్రంగా ప్రేమించిందంటే- అతని పరిచయం వల్ల, అక్షరాలు కూడా స్పష్టంగా పలకలేని ఆమె మౌనం నుంచి, అమృతం లాంటి అక్షరాలు అంబరం నుంచి అనంతంలా జాలువారాయి!
ఆమె మనస్సు ఒక తపస్సుగా మారింది!
ఆమె హృదయం ఒక ప్రేమ యజ్ఞంగా మారింది!
ఆమె చిత్తం ప్రపంచం మొత్తం పరిచే తివాచీగా మారింది!
ఆ ప్రేమలో దహించుకుపోయిన ఆమె అహంకారం, తన వ్యక్తిత్వానికి ఒక
అలంకారంగా మారింది!
ఆ ప్రేమలో మునిగిపోయిన ఆమె వివేకం,
తన జీవితానికి కొత్త మార్గం చూపింది!
ఆ ప్రేమలో అంతరించిపోయిన ఆమె అస్తిత్వం, తన ఆయువుకు నూతన అమృతాన్ని జత చేసింది!
అలాంటి అంతుపట్టని అంతులేని అవస్థను అనుభవిస్తున్న, ఆ అందాల ఆశకు ఒక ఆశయం జన్మించింది!
అలాంటి ఆనందానికి బందీగా మారిన ఆ అవనికి కొత్త పులకింత పరిచయం..................