హరామీ
- సయ్యద్ సలీం
సన్రైజ్ వ్యాలీ... హైదరాబాద్ శివార్లలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ... నిన్ననే కొత్త యింట్లోకి నేనూ నా భార్య గృహప్రవేశం చేశాం. నిన్నంతా యిల్లు సర్దుకోవడంతోనే సరిపోయింది. ఉదయం రెండు ఇడ్లీలు తిని, కాఫీ తాగాక, హాల్లో సోఫాలో కూచుని టీవీలో వార్తలు చూస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మోగింది. నా కాళ్ళదగ్గర కూచుని విశ్రాంతి తీసుకుంటున్న బ్రూనో వెంటనే అప్రమత్తమై లేచి నిలబడ్డాడు.
కాలింగ్ బెల్ శబ్దానికి నా భార్య ముంతాజ్ బేగం కూడా హాల్లోకొచ్చి "ఈ సమయంలో మనింటికొచ్చేవాళ్ళెవరండి?” అంది కుతూహలంగా.
మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరమ్మాయిలు కంప్యూటర్ ఇంజనీరింగ్లో యం.టెక్ చదివారు. మూడో అమ్మాయి బి. టెక్ చేశాక యం.బి.ఏ చేసింది. ముగ్గురికీ నిఖాలు చేసి పంపించేశాం. ఇద్దరల్లుళ్ళు అమెరికాలో, మూడో అల్లుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అల్లుళ్ళతోపాటు మా కూతుర్లు కూడా ఉద్యోగాల్లో ఉన్నారు. మాకు హైదరాబాద్లో బంధువులెవరూ లేరు. బంధుగణమంతా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. అందుకే ముంతాజ్ అలా అడిగుంటుందనుకుని "కొత్తగా యింట్లో చేరాం కదా. చుట్టుపక్కల వాళ్ళెవరైనా పలుకరించి పోవడానికి వచ్చుంటారు" అంటూ గుమ్మానికున్న పరదా తొలగించి, గేట్ వైపు చూశాను.................