• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Agneepathm
₹ 150

విభిన్న ఇతివృత్తాలతో విలక్షణ నవలలు

కథారచయితగా 'పాలపిట్ట' పాఠకులకు సుపరిచితులైన గన్నవరపు నరసింహమూర్తి రాసిన రెండు నవలలు ఇవి. పోలీస్ వ్యవస్థలో నిజాయితీగా పని చేయడానికి పూనుకున్న ఒక యువ ఐపిఎస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్ళను, రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళను అధిగమించి నిజాయితీగా పని చేసిన తీరును 'అగ్నిపథం' నవల ఆవిష్కరించింది. నీతి, నిజాయితీ, చట్టాన్ని అమలు చేసే పట్టుదల గల పోలీసు అధికారులు ఉన్నపుడు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించిందీ నవల. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో నడిచింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలోని ప్రకృతినీ, పరిస్థితులనీ, సమస్యలనీ బలంగా చిత్రించిన నవల ఇది. ప్రజలకు సేవ చేయడానికి అంకితమై పనిచేసే అధికారులు జనానికీ, సమాజానికి ఎన్నివిధాల మేలు చేసే అవకాశం ఉన్నదో ఈ నవల చదివితే బోధపడుతుంది.

ఉత్తరాంధ్రలోని వ్యవసాయిక పరిస్థితులను, నీటి ప్రాజెక్టుల కోసం ఆందోళనలని చిత్రించిన నవల 'మట్టిమనుషులు'. అంతేగాక తన ఊరి ప్రజల కోసం తపించే ఓ ఐఐటి చదువుకున్న యువకుడి జీవనగమనం భూమికగా రూపుదిద్దుకున్న నవల ఇది. వ్యవసాయరంగం సంక్షోభరహితంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ నవలలో రచయిత చర్చించారు. అలాగే పల్లెల నుంచి వలసలు ఆగిపోవాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో బాగా చెప్పారు. ముఖ్యంగా మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని ఆరంగా చిత్రించారు రచయిత. ఈకాలాన అమెరికాకు తరలిపోవడమే లక్ష్యంగా ఉన్నత చదువుల్లో చేరుతున్నారు. దీనికి భిన్నంగా తన గ్రామం కోసం, అక్కడి ప్రజల కోసం, నీటివసతుల కలువ కోసం ఓ యువకుని తపనని, కృషిని దృశ్యమానం చేసిన నవల 'మట్టిమనుషులు, ఈ నవలా పఠనం ఉదాత్త అనుభవం. ముఖ్యంగా సన్నివేశాల కల్పన, సంబాపణలు సహజంగా ఉన్నాయి. గన్నవరపు నరసింహమూర్తి కథనశైలిలోని ప్రత్యేకత............

  • Title :Agneepathm
  • Author :Gannavarapu Narasimhamurthi
  • Publisher :Palapitta Publications
  • ISBN :MANIMN3496
  • Binding :paperback
  • Published Date :April, 2022
  • Number Of Pages :180
  • Language :Telugu
  • Availability :instock