• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aham Asuya

Aham Asuya By K Gangadar

₹ 75

అహం • అసూయ

సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్న ఒంటరి మగవాడికి, భార్య అవసరం ఎంతైనా ఉంటుందనేది అందరూ నిరభ్యంతరంగా ఒప్పుకునే సత్యం.

అటువంటివాడు తమ ఇరుగుపొరుగులలో ఎక్కడైనా ప్రవేశించినట్టయితే, అతని అభిప్రాయాల గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు కూడా, తమ కుమార్తెలలో ఎవరికో ఒకరికి ఈ శ్రీమంతుడు భర్త అయితే బాగుండుననుకొంటారు.

ఒక రోజు ఉదయం బెనెట్ భార్య ఆయనతో అంది. "ఏమండీ! నెదర్ ఫీల్డ్ పార్క్ చివరకు అద్దెకు ఇచ్చారు, చూశారా?"

| బెనెట్ తనకేమీ తెలియదన్నాడు.

"ఇచ్చారు, ఇంతకు ముందే లాంగ్ ఇక్కడికి వచ్చి ఈ విషయం చెప్పి వెళ్ళింది." దీనికి కూడా బెనెట్ ఏమీ బదులు పలుకలేదు.

'ఇంతకూ ఆ ఇల్లు ఎవరు తీసుకున్నారో తెలుసు కోవాలని ఉందా?" అని అడిగింది. "నీకు చెప్పాలని ఉంది కదూ! చెప్పు, వింటానికి నాకేం అభ్యంతరం లేదు!" ఆమెకు ఈ మాత్రం ప్రోత్సాహం చాలు.

"మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నెదర్ ఫీల్డు అద్దెకు తీసుకున్న వ్యక్తి యువకుడట! గొప్ప ఐశ్వర్యం! ఉత్తర ఇంగ్లండు నుంచి వచ్చాడట. సోమవారంనాడు నాలుగు. గుర్రాల బగ్గీ ఎక్కి వచ్చి భవనం చూసుకు వెళ్ళాడట. ఇల్లు, పరిసరాలు అతనికి ఎంతగానో నచ్చాయట. త్వరలోనే వచ్చి చేరతారట. అతని సేవకులు పైవారంలో వచ్చి చేరతారట?

"ఇంతకూ అతని పేరేమిటి?"

"Don."

"వివాహితుడా లేక బ్రహ్మచారేనా?”

"బ్రహ్మచారేనండీ! ఒట్టి బ్రహ్మచారే కాదు, ఆగర్భ శ్రీమంతుడు! సంవత్సరానికి నాలుగైదు వేల ఆదాయం ఉంటుందట. మన అమ్మాయిలకు ఎంత అదృష్టంగా "అదెలా? అతని ఆదాయానికి, అమ్మాయిల అదృష్టానికి సంబంధం ఏమిటి?" "అబ్బబ్బ! మీరేమీ అర్ధం చేసుకోలేరండీ! అతను మన అమ్మాయిలలో ఒక దాన్ని వివాహం చేసుకుంటాడేమోనని ఆలోచిస్తున్నాను" అంది ఆయన భార్య. "అతను ఇక్కడ చేరటంలో ఉద్దేశమే అదంటావా?"

"ఉద్దేశమా? ఏమిటండీ, ఇలా అసందర్భంగా మాట్లాడతారు? అతను ఎవరినన్నా ప్రేమించటానికి అవకాశం ఉందికదా! అందుచేత మీరొకసారి వెళ్ళి కలుసుకోండి.".............

 

  • Title :Aham Asuya
  • Author :K Gangadar
  • Publisher :Peacock Classics, Hyd
  • ISBN :MANIMN4554
  • Binding :Papar back
  • Published Date :2014 First Published
  • Number Of Pages :125
  • Language :Telugu
  • Availability :instock