పరిచయం
మీరు సులువుగా మోసపోగలుగుతారు. మొట్టమొదట మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండటమే.
- రిచర్డు ఫెన్మెస్
మీరు యువకులుగా ఉండి ఏదో ఆశయం కోసం పట్టుదలతో పనిచేస్తున్న వారు కావచ్చు లేదా సమస్యలతో తెగ పోరాడుతున్నవారు కావచ్చు. తొలి మిలియన్ సంపాదించి, ఒక పెద్ద ఒప్పందం చేసుకుని పేరుపొందిన బృందంలో సభ్యత్వం పొందిన వారు కావచ్చు లేదా ఇప్పటికే మీరు జీవితాశయాన్ని సాధించిన వారు కావచ్చు. విజయశిఖరాలు చేరిన తర్వాత అక్కడ ఎంత శూన్యం ఆవరించిందో అన్న ఆలోచనలతో ఉన్న వ్యక్తయినా కావచ్చు. సంక్లిష్ట వాతావరణంలో ఓ పెద్ద బృందానికి నాయకత్వం వహిస్తున్నవారు కావచ్చు లేదా ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా బయటకు నెట్టివేయబడిన వారు కావచ్చు. ఇవేమీ కాకపోతే ఒక్కసారిగా కుప్పకూలి జీవితంలో అథోగతి పాలయిన వారు కూడా కావచ్చు.
మీరేం చేస్తున్నా, మీరెక్కడ ఉన్నా, మీకు చేటు చేసే శత్రువు మీలోనే ఉంటుంది. దాన్నే 'అహం' అని పిలుస్తారు.
“నాకు అహం లేదు. నన్నెవరూ ఇంత వరకూ అహంకారి అని అనలేదు తెలుసా?" అని మీరు అనవచ్చు. చాలా సంయమనంతో నడుచుకునే వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించుకో వచ్చు. కానీ ఆశయాలు, నైపుణ్యాలు, సమర్థత, ప్రేరణ, శక్తితో ఏదయినా సాధించ దలుచుకున్నప్పుడు అక్కడ అహం రంగప్రవేశం చేస్తుంది. మనం ఆలోచనా పరులుగా, సృజనాత్మక జీవులుగా, క్రియాశీలురుగా, వ్యాపారవేత్తలుగా ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి చేరేందుకు సాగించే ప్రయత్నంలో మనస్సులో దాగి ఉంటే ఈ చీకటి కోణం మనల్ని దుర్బలులుగా మారుస్తుంది.
ఫ్రాయిడ్ పరిభాషలో అహాన్ని గురించి వివరించే పుస్తకం కాదిది. గుర్రంపై స్వచేసే వ్యక్తి లాంటిది అహం అని, జంతువు మాదిరిగా ఉపచేతన మనసు దానిని నడుపుతూ ఉంటుందని ఫ్రాయిడ్ ఒక పోలిక ద్వారా దాని గురించి చెప్పే మత్నం చేస్తారు. ఆధునిక మనస్తత్వవేత్తలు మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతారు.
ఆ పట్ల అలక్ష్యం చూపుతూ, ప్రమాదకరస్థాయిలో తమను గురించి తాము అప్పగా ఆలోచించుకునే వారిని అహంకారులు అని చెబుతారు. ఇవన్నీ నిర్వచనాలు వలన,కానీ వైద్యసంబంధమైన వ్యవహారాలకు వెలుపల మాత్రం వాటికంత వ్యాపారవేత్తలుగా ఆయా రంకటి కోణం మనల్ని మన పుస్తకం కాదిది. పరంగా సరైనవే,కానీ వైద్యసంబంధమైన విలువ లేదు............