అజ్ఞాత యోధుడు
నాకు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చెవులు బ్రద్దలయ్యేలాంటి విస్ఫోటనం వల్ల ఇల్లు ముక్కలు చెక్కలు అవుతుందని అనిపించింది. సూర్యోదయకాలపు గుచ్చుకునే వెలుతురుకు నా కళ్ళు సంకోచించాయి. జనాల కేకలు, ప్రేల్చుతున్న తూటాల శబ్దాలతో నా చెవులు నిండిపోయాయి. నేను చాలా ఆలస్యంగా, తెల్లవారటానికి మునుపు పడుకున్నాను. బాగా అలసిపోయాను. ఆ కారణంగా నిద్ర నుంచి లేవటానికి నాకు చాలా కష్టమైంది.
ఆస్ట్రోవికా కొండ నుంచి దూరపు ప్రయాణాన్ని ముగించి నేను ఇప్పుడిప్పుడే వచ్చాను. అక్కడ దాయాదులకు సంబంధించిన ఒక పొట్లాటనో, అపరాధమో జరగబోతోంది. ఇరువైపులవారిని రాజీ చేయటానికి మా పార్టీ,................