నా ప్రపంచం
నేను నాలాగే పుట్టాను.
నాలాగే మరణిస్తాను
కానీ.... పరులకు
మరోలా కనిపిస్తాను
ఏవి ఏమైనా.
అక్షర గనిలో కార్మికుడనై
అలుపెరగక శ్రమిస్తాను....
వినీల గగనంలో
వెలుగును పంచుటకు
తనని తానే తగలబెడుతున్న
సూర్యునికి
ఆప్తుడనయ్యాను....
నలుపెక్కిన రేతిరిలో
చంద్రునికి పహారా కాసే
నక్షత్ర సైన్యాలకు
మిత్రుడనయ్యాను
“ఆకాశ దేశాన్ని” సృష్టించాను ప్రపంచం
ఇది నా ... మరో
నా కలల్ని కూలదోసిన కాలానికి
ఎదురీదుతూ సృష్టించిన
మరో ప్రపంచం
పరులందరూ ద్వేషించే.....................