అనంతపురం.
డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్.
టవర్క్లో టైము ఒంటిగంట దాటి ఐదు నిమిషాలు. లంచ్ టైము. స్టూడెంట్స్ జట్లు జట్లుగా వస్తున్నారు. రోడ్డుమీద కొందరు, సైకిళ్ల మీద డబుల్ రైడింగు త్రిబుల్ రైడింగు పోతున్నారు. ఆడపిల్లలు నవ్వుతూ మాట్లాడుతూ, మాట్లాడుతూ నవ్వుతూ, పుస్తకాలు గుండెలకు ఆనించుకుని వస్తున్నారు. మగపిల్లల వైపు చూసీచూడనట్లు చూస్తున్నారు. తమను వెంబడించే బాడీగార్డులను గుర్తుపెట్టుకుంటున్నారు.
కొందరు కొందరిని చూసి నవ్వుతున్నారు.
కొందరు కొందరిని చూసి ముఖాలు తిప్పేసుకుంటున్నారు.
బెల్బాటమ్స్...
హాఫ్ షర్టులు, ఫుల్ షర్టులు...
ఫుల్ షర్టులను మోచేతులపైకి మడిచినవాళ్లు
ఇన్షర్ట్ చేసినవాళ్లు
తెల్లప్యాంటు మీద తెల్ల జుబ్బా వేసుకుని కవుల్లా నడిచేవాళ్లు
హిప్పీ క్రాఫులు
వచ్చీరాని మీసాలు...................
బండి నారాయణ స్వామి