అందరూ అందరే!
అది 'దిగుమతులు మరియు ఎగుమతులు' కార్యాలయం. అందులో కొందరు గుమాస్తాలు. ఆ గుమాస్తాల మీద 'స్వారీ' చేయటానికి ఓ మేనేజరు. పేరు-మేనక! ఈరోజుల్లో ఉద్యోగాలు చేసేవారు కొందరికి పక్క వ్యాపారాలు నడపటం అలవాటు. అలాగే ఆ గుమాస్తాలకీ పక్క వ్యాపారాలున్నాయి.
ప్రమోద్కి పెళ్ళి సంబంధాలు చూడటం, పెళ్ళిళ్ళు కుదర్చటం పక్క వ్యాపారం. (ప్రమోద్ పేరు తర్వాత 'ప్రమాదం'గా మారిపోయింది)
రామేశం పక్క వ్యాపారం - వాస్తు చూడటం, జ్యోతిష్యం చెప్పటం (ఎవరూ ఇవ్వకపోయినా 'వాస్తురత్న' బిరుదు తనే తగిలించుకున్నాడు)
కార్తీక్ పక్క వ్యాపారం చెట్టుకింద ప్లీడరీ (విడాకుల కేసుల్నే చూస్తాడు). సంతోషు పక్క వ్యాపారం లేదు. పేరుకు తగ్గట్టుగా కూడా ఉండడు (కాలక్రమంలో సత్యవాదిగా మారిపోయాడు)....................