• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Akilakalaa Vaibhavasree ADIVI BAPIRAJU 1 & 2

Akilakalaa Vaibhavasree ADIVI BAPIRAJU 1 & 2 By Dr Nagasuri Venugopal

₹ 1000

సౌమ్య శీతల మనస్వి

- శ్రీ అవంత్స సోమసుందర్

భావనా వీధిలో పెళ్ళికొడుకుల ఊరేగింపు సాగుతోంది! అవును - శతజయంతి ఉత్సవ నాయకుల ఊరేగింపుటుత్సవం సాగిపోతున్న ఋతువిది! బసవరాజు అప్పారావు మంచి ప్రారంభకుడు. 1994 సంవత్సరాన్ని సంపద్వంతం చేశాడు. చలం, నండూరి, విశ్వనాథ, బాపిరాజు, జాషువా, పింగళి, కాటూరి కవులు ఎందరెందరు పెండ్లి కొడుకులు!

గత శతాబ్ది చివరి దశకంలో జననమంది కవితావధూటి వేలందుకొని నిరంతర ఆశాజీవులై, భవిష్యత్సుందర స్వప్నాల నాహ్వానిస్తూ, హాయిగా, విలాసంగా నడచి నడచీ, ఈ శతాబ్దినంతా కొత్త సందడితో పండించి, ఉత్ప్ర్పేకాన్నీ, ఉత్సాహాన్నీ సంతత జీవధారలుగా నిలిపి - ఆనందం కురిసిన మహాకవులు ! ఎన్నో భిన్నత్వాలను వెలయించారు?

కవులుగా ఎవరి గొంతు వారిది! ఎవరి విన్యాసాలు వారివి! అందుకో దలచిన వెలుతురులో విభిన్నత్వం లేదు. ఎవరి ఆశయాలూ, ఆదర్శాలూ, విశ్వాసాలూ వారివి. అందించదలచిన పునరుజ్జీవన క్రాంతికళికలలో విభేదం లేదు. ఒక వెన్నెల చేరుల జాతరలా సాగిపోయారు. అంతా కలసి సమష్టిగా మాతృవందనం చేశారు. ఎవరికి వారుగా వ్యష్టిగా ఎవరి కలలను వారు పండించుకున్నారు. నిజమే మరి, ఒకడి కలలు వేరొకడు కనలేడు. ఒకడి కవిత్వం వేరొకడు రాయలేడు. సంస్కారపు లోలోతులకు వ్రేళ్ళు పారించి, ఒకే జీవపదార్థం సేకరించుకున్నా- ఆ వృక్షజాతి పితృ పరంపర నుంచి సంక్రమించిన జీవలక్షణాలతో పండే పండ్లు వేరు, రుచి వేరు, వాసన వేరు, రంగు వేరు. కాని అన్ని రకాల పండ్లూ బీజావాసనకే! వంశాభివృద్ధికే! ఆ మహాకవులంతా కవి వంశాభివృద్ధి కోసమే స్వప్న ఫలాలందించారు!

వెలుగు తుంపరల ఊయెలలో అందరూ ఒక్కలాగే ఊగిపోయారు. భవిష్యత్ శిశువును ఉచిపోయారు! కాంతి శిఖరాలు వెదజల్లుతూ, ఎంత షోకుగా, ఎంత

సాహితి, చిత్రలేఖన, శిల్ప, నాట్య, సంపాదక, సినీకళా నైపుణ్యాల విశ్లేషణ................

  • Title :Akilakalaa Vaibhavasree ADIVI BAPIRAJU 1 & 2
  • Author :Dr Nagasuri Venugopal
  • Publisher :Sri Raghvendra Publications
  • ISBN :MANIMN4601
  • Binding :Paerback
  • Published Date :March, 2023
  • Number Of Pages :826
  • Language :Telugu
  • Availability :instock