అక్కడే ఆగక
I don't fix problems. I fix my thinking. Then the problems fix themselves - Louise Lynn Hay (American motivational author)
అది అనాదిగా మారనిది.
దుర్భేద్యమైన కోటని కూడా పగలకొట్టుకుని అది లోపలకి ప్రవేశిస్తుంది.
అనుభవంమీదే అది అర్ధమవుతుంది. దాన్ని అనుభవించే మనుషుల భావోద్వేగాలు, చర్యలు, అనుభూతులు, అనుభవాల సాంద్రత మాత్రం మారుతూంటుంది. దాని గురించి ఎంత కాల్పనిక సాహిత్యం రాసినా, ఇంకా రాయాల్సింది చాలా మిగిలే ఉంది. దాన్ని ఎంత తవ్వి తీసినా ఇంకా వస్తూనే ఉంటుంది. కారణం అదో తరగని గని. అది మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా మారుస్తుంది. కోటలోని రాజుని గుడిసెలోకి, గుడిసెలోని పేదవాడ్ని సింహాసనంమీదకి మార్చే శక్తి దానికి ఉంది. అది బతికిస్తుంది. చంపుతుంది. ఒకోసారి కొందర్ని చంపి, బతికించి, చస్తూ జీవించేలా చేస్తుంది.
అది ప్రేమ!
ప్రేమ పుట్టాక బర్త్ సర్టిఫికెట్ జారీ చేయబడదు. అది మరణించాక మాత్రం ఒకోసారి డెత్ సర్టిఫికెట్ జారీ చేయబడచ్చు....................