సమైక్యతాపథంలో ఈ ఏటి సంక్రాంతి
సరిగ్గా నిరుడీ రోజుల్లో - ముంగిట తీర్చిదిద్దిన రంగవల్లులతో, యింటింటా | పండుగ వేడుకలతో అలరారవలసిన సంక్రాంతి పర్వదినాలలో తెలుగుజాతి పెద్ద సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుకుంటున్న పరిస్థితులు ఆంధ్రదేశమంతటా నెలకొని వున్నవి. శతాబ్దాలుగా విడిపోయిన తెలుగు ప్రజలు చిరకాల స్వప్నంగా | ఉపలక్షించుకుని అనేక పోరాటాల, అశేష త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాలాంధ్ర అస్తిత్వానికే, భాషా రాష్ట్రాల సూత్రానికే సవాలుగా పరిణమించిన | ప్రమాదకర పరిస్థితులవి. వలసపాలన, భూస్వామ్య అవశేషాలుగా సంక్రమించిన | ప్రాంతీయ అసమానతలు పెట్టుబడిదారీ అభివృద్ధిక్రమంలో మరింత పెచ్చరిల్లి | చెలరేగిన ప్రాంతీయ భావోద్రేకాల విషసర్పాలు బుసకొట్టిన దుర్దినాలవి. ఆంధ్రప్రదేశ్ | సమగ్రత అగ్నిపరీక్ష ఎదుర్కొన్న ఘట్టమది. కాల్పులతో, కర్ఫ్యూలతో ప్రాణాలు చిక్కబట్టుకుని గడిపిన కాళరాత్రులవి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో పెద్ద మెజారిటీతో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది తిరక్కముందే రద్దు చేయబడి రాష్ట్రపతి పాలన విధింపబడుతున్న రోజులవి.
సరిగ్గా ఈనాడు పరిస్థితులందుకు భిన్నం. ప్రాంతీయ భావోద్రేకాలు, ఆవేశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కడున్నా రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల | సత్వరాభివృద్ధికీ, ఆంధ్రప్రదేశ్ సమగ్రతా పరిరక్షణకూ, సుస్థిరతకూ దోహదం చేసే................