అక్షరయజ్ఞం
నీరవ నిశీధిలో కీచురాళ్ళ రొద మధ్య
అతను ఒంటరిగా నడుస్తున్నాడు.
చెదిరిన జుత్తు...
పెరిగిన గెడ్డం...
మాసిన బట్టలు...
అరిగిన చెప్పులు...
అలక్ష్యంగా నడక....
అంతులేని ఆలోచనల్ని నింపుకొన్న మెదడు.
నిర్మానుష్యంగా వున్న నడివీధిలో నిరాకారంగా నింగికేసి నడుస్తున్నట్టు.... నడుస్తూనే వున్నాడు.
కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. వాలుతున్న ఆ కళ్ళ రెప్పల వెనుక కరిగిపోతున్న కలలు... అలలు... అవే కన్రెప్పలు అలవోకగా మూతపడితే...
కైలాస శిఖర దర్శనం.........................