కొకైన్ కింగ్
మనిషి ఆశాజీవి, భవిష్యత్తు మీద ఆశే అతన్ని ముందుకు నడిపే ఇంధనం. అంతేకాదు జీవితంలో యెన్నో సాధించాలనే కలలు కనడం, ఆ కలలని నిజం చేసుకోవడానికి యెంతో శ్రమించడం, యెత్తులకి పై యెత్తులు వెయ్యడం, జిత్తులు చెయ్యడం ఇదంతా మనిషి జీవితంలో ఒక భాగం. కానీ ఆ ఆశ దురాశ కాకూడదు. ఉన్నతంగా జీవించాలని కలలు కనడం తప్పుకాదు కానీ, ఆ కలలు తీర్చుకోడానికి యెన్నుకునే మార్గాలు సరైనవి కాకపోతే అవే అతని వినాశనానికి కారణమవుతాయి.
అందుకే "యెంత విభవము గలిగిన అంతయును ఆపద" అనీ, "దురాశ దుఃఖమునకు చేటు" అనీ పెద్దలు చెప్పిన మాటలు మరిచి పోగూడదు. అవి నూటికి నూరుపాళూ నిజాలని మనకి నిరూపించే ఉదాహరణలుగా కొంత మంది జీవితాలుండటం కూడా ఆశ్చర్యంగా వుంటుంది.
అలాంటి జీవితమే కొకైన్ కింగ్గా పిలవబడే పాబ్లో ఎస్కోబార్. అతను 1980-90 సంవత్సరాల మధ్యలో మాదక ద్రవ్యాల మహాసామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా వెలిగిపోయాడు. అమెరికాకు అక్రమంగా రవాణా అయ్యే కొకైన్లో................