• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ala Raju Rayabaramu PALNATI YUDHAM

Ala Raju Rayabaramu PALNATI YUDHAM By Jannabhatla Narasimha Prasad

₹ 100

రమణీయ రూపకం అలరాజు
 

రాయబారం

పూజ్యులైన కీ॥శే॥ జన్నాభట్ల నరసింహశాస్త్రి కవివర్యులు రచించిన “అలరాజురాయబారం" నాటకం తెలుగు నాటక సాహిత్యంలో ఓ మణిపూసగా భాసించగలదని నా ప్రగాఢ విశ్వాసం. "పలనాటి యుధ్ధం" అనే ఉప శీరిషకను కవివర్యులే ప్రకటించారు. పుస్తకం చూడగానే అలరాజు పాత్ర ప్రాధాన్యం వహిస్తుందని సులభంగా పాఠకులు ఊహించవచ్చు. నాటకం రచనాకాలం 1981 డిసెంబరు మాసం. దాదాపు తొంబయి పుటల గ్రంథం నాచేతికి వచ్చింది.

గ్రంథం ఆ సొంతం ఏకబిగిన నేను చదివాను. ఈ పుస్తకమే నన్ను చదివించింది అనడం అతిశయోక్తికాదు. కవి గొప్ప ప్రతిభావంతుడు. లోగడ వీరు గ్రంథాలు - ప్రత్యేకంగా నాటకాలు వ్రాశారో లేదో నాకు తెలియదు కాని, రూపక రచనా నిర్మాణ వీరికి అలవోకగా అబ్బిన కళగా భావించవచ్చు. అయిదు అంకాల ఈ నాటకం ఆద్యంతం సరళతరంగా మృధు మధురంగా కవీశ్వరులు రచించారనడంలో సందేహంలేదు. పద్య రచనా విధానం అత్యంత సరళంగా, నాటక ప్రదర్శనకు చాల అనుకూలంగా, గానానికి సౌలభ్యంగా ఉంది. అలతి అలతిపదాలలో ద్రాక్షాపాక సమన్యితంగా కవివర్యులు లిఖించారు. తెలుగు సాహిత్యంలో నేటి తరంతో సంప్రదాయ నాటక రచనా ప్రయత్నాలు బాగా లుప్తమయ్యాయి. తక్కువ మంది వ్రాసినా, వ్యాపారాత్మక ధోరణులు ఎక్కువయ్యాయి. ఏదో ఒక యితివృత్తం తీసుకొని యాబై పద్యాలకు తక్కువ కాకుండా ముందే తీర్మానించుకొని, పరిషత్ నాటకాల పోటీలకు ఆనుకూల్యంచేసుకొని, ప్రతిఫలాపేక్ష ప్రాధానంగా భావించుకొని కొంత మంది రచన చేస్తున్నారు...............

  • Title :Ala Raju Rayabaramu PALNATI YUDHAM
  • Author :Jannabhatla Narasimha Prasad
  • Publisher :Jannabhatla Narasimha Prasad
  • ISBN :MANIMN4404
  • Binding :Papar back
  • Published Date :Feb, 2018
  • Number Of Pages :79
  • Language :Telugu
  • Availability :instock