• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Alakananda

Alakananda By Nunna Teja

₹ 90

ఉనికి

సముద్ర తీరముతో నిండిన ఇసుక నేల ప్రాంతము. వేరుశనగ పంటకు అనువుగా ఉందని సాగుచేస్తున్న రైతు. ఇంతలో నిశ్శబ్దంగా ఉన్న అలల పయనములో చల్లగాలితో కూడిన పక్షుల కిలకిల రాగాల నడుమ, విహంగాల కేరింతల మధ్యలో దినకరుడు రోజును మొదలు పెడుతూ వెచ్చని ఉషస్సును, ఉత్సాహాన్ని ఇస్తున్నాడు.

రైతుకు ఏటవాలుగా సూర్యుడి కాంతి ప్రసరించే సమయానికి ఒక గాజుల వ్యాపారిగా మారి రెండు చక్రాల బండి ఎక్కి తొక్కుతూ జీవన చక్రాన్ని తన భుజస్కందాల మీద నడుపుతూ ఉన్నాడు 'రామరాజు'.

ఇక వర్తక వ్యాపారము చేస్తూ వివిధ ప్రాంతాలు తిరుగుతున్న వామనరావు చెల్లాయి అయిన అనూరాధ ఇంటికి వచ్చి తన చేతితో చేపల పులుసు చేసిన చెల్లాయిని మెచ్చుకొని మురిసిపోయిన సందర్భమున. అనురాధ స్వయాన అన్నయ్యకు ఆర్తితో భోజనము వడ్డిస్తూ ఉంది. అన్నయ్య రామన్నపేట ఊరి రామాయణం అంతా కబుర్లుగా మలచి ఆనందంగా ఆరగించసాగారు. ఇంతలో రామరాజు సాయంత్రం ఇంటికి చేరాడు.

అన్నయ్య ధ్యాసలో పడి రామరాజును చూడలేదు అనూరాధ. రామరాజుకు పోసుకోలు మాటలు అంటే ఇష్టం ఉండదు. అందులోను తన కూతురు నాగ రమణి అష్టమి రోజు జన్మించింది అని మేనమామ వామనరావుకి ఇబ్బంది అని తెలిసి మేనమామ కోపమును వ్యక్తపరుస్తాడు. వెంటనే బ్రాహ్మణుడి దగ్గరకు తీసుకొని వెళ్ళగా పెద్ద కుటుంబాన్ని నాగ రమణి నడుము బిగించి ముందుకు నడిపిస్తుంది అని చెప్పగా ప్రశాంతంగా ఉన్నాడు వామనరావు. అందుకు బావ అయిన వామనరావు అంటే కొంచెం కసురుకుంటాడు...................

  • Title :Alakananda
  • Author :Nunna Teja
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN5493
  • Binding :Papar back
  • Published Date :May, 2024
  • Number Of Pages :90
  • Language :Telugu
  • Availability :instock