అధ్యాయం ఒకటి
కెప్టెన్ లేని నౌక
ఫ్రాన్స్లోని మార్సిలెస్. మధ్యధరా సముద్ర తీరంలోని రేవు పట్టణం. ఫారోన్ ఆరోజు సొంత రేవుకు తిరిగి వస్తోంది. బట్టలూ, అద్దకం రంగులూ, వగైరాలను " వేసుకుని వస్తోంది. ఫారోన్ని రేవులోకి తెచ్చి లంగరు వేయడం చూడాలని " జనం గుమిగూడారు. అది 1815. ఆ రోజుల్లో పెద్ద పెద్ద రవాణా నౌకలను రేవులోకి తెచ్చి, సరుకులు దించడానికి వీలుగా లంగరు వేయడమంటే మాటలు కాదు. అదో కళ. చూడ్డానికి ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ఫారోన్ చాలా మెల్లగా వస్తోంది. జరగకూడనిదేదో జరిగి ఉండాలి, అనుకున్నారు గుమిగూడిన J వాళ్లు.
మోరెల్గారు ఆ ఓడ యజమాని. తన ఓడ తిరిగి వస్తోందన్న వార్త విని సంతోషంగా ఆయన కూడా రేవుకు వచ్చారు. ఓడ చక్రం దగ్గర కెప్టెన్ లాసిరె ఉండాల్సింది. కానీ ఇప్పుడు అక్కడ పొడవుగా బలంగావున్న యువకుడున్నాడు. అతను ఎడ్మండ్ డాంటేస్. ఫారోన్ ఇప్పుడు అతని ఆధీనంలో ఉంది. ఆ దుర్వార్తేదో వెంటనే తెలుసుకోవాలని మోరెల్గారి ఆదుర్దా. ఓ తెడ్ల పడవను తెమ్మని ఆజ్ఞాపించి, అందులో బయల్దేరాడు.
తెడ్ల పడవ ఫారోన్ని సమీపించడంతోనే ఎడ్మండ్ తాళ్ల నిచ్చెనను విడవమని ఆదేశించాడు. మోరెల్ పైకెక్కి ఎడ్మండ్ వేపు ఆందోళనగా చూసాడు. తెలివితేటలు తొంగిచూసే ఎడ్మండ్ నల్లటి కళ్లల్లో దిగులూ సానుభూతి.
"విషాదకరమైన సంగతి సార్. కెప్టెన్ సిలెరె చనిపోయాడు. సముద్రంలోనే సమాధి చేసాం. ఇటలీలోని నేపుల్స్నుంచి బయలుదేరాక అతనికి మెదడు వాపు. వ్యాధి వచ్చింది. అతను సంధి ప్రేలాపనలు మొదలెట్టినప్పటి నుండి నేనే.............