ఆలితో సరదాగా
సీన్ నెం. 1
(గోపాలం ఇల్లు. సాధారణ అలంకరణ. తెర తొలగేవేళకు రాధ దేవుళ్ళకు హారతి ఇస్తోంది.)
బాబాయ్ : (బయటి నుండి వచ్చి) ఏడు కొండలవాడా..! వెంకట రమణా గోవిందా గోవిందా..!
రాధ : బాబాయ్ గారూ.. మీరా? రండి రండి.. అదేమిటో శనివారం వస్తే చాలు. మీరు చెవిలో పువ్వు, మొహంలో నవ్వు, నుదుట నామం, చేతిలో ప్రసాదం పెట్టుకుని టక్కున ప్రత్యక్షమైపోతారు.
బాబాయ్ : : బాగుందమ్మా..! చేసేది మామూలు ఉద్యోగమా? మామూళ్ళ ఉద్యోగం.. చేసే పాపం చేతికంటకుండా వుండాలంటే వారానికో రోజైనా నేను నామం పెట్టుకోవాలి. మిగతా రోజులు జనానికి పెట్టాలి. (చేతిలో వున్న కొబ్బరిచిప్ప ఇస్తూ) ఇదిగోమ్మా.. ప్రసాదం..! అమ్మాయ్ నువ్వు ఏమీ అనుకోకపోతే నీతో చిన్న పనొచ్చిపడిందమ్మా..
రాధ : : నాతోపనా? నావల్లకాదు. అని అంటాననుకున్నారా? ఊహూ.. చెప్పండి చేసిపెడతాను.
బాబాయ్ : ఏమీలేదమ్మా.. మీ పిన్ని, మనవడు కల్లోకొచ్చాడని పొద్దున్నే బస్సెక్కింది. నేనూ పనిమీద బయటకెళ్ళి సాయంత్రానికొస్తాను. అందుకే ఈ తాళం చేతులు నీ దగ్గరుంచుకుని ఎవరైనా అద్దింటికోసమొస్తే ఆ ఖాళీగా వున్న పోర్షన్ చూపిస్తావనీ...
రాధ : ఓస్ ఇంతేనా? దానికేం భాగ్యం.. అలాగే యివ్వండి(తీసుకుంది)
బాబాయ్ :
: అమ్మాయ్..! అద్దె పదివేలు, మూడునెలలు అద్దె ముందుగా ఇవ్వాలని చెప్పు.
రాధ : అలాగే..!
బాబాయ్ : : ఇకపోతే నువ్వేమీ అనుకోకపోతే ఒక్కమాట.
రాధ :: చెప్పండి