గిరిజన 'జీవన ప్రపంచంలో
బ్రిటీష్ సామ్రాజ్యం
మదాస్ ప్రెసిడెన్సీ'లో 1920లలో అటవీ సమస్యలపై జరిగిన గిరిజన ఇవనలో రెండు స్రవంతులున్నాయి. దానికి ఉమ్మడి లక్ష్యం ఉంది. అయితే రాజకీయ సంతం, పోరాట రూపాల్లో తేడాలున్నాయి. 1921-22లో అటవీ సమస్యలపై అని పోరాట రూపాలూ కాంగ్రెస్ నేతృత్వంలోని సహాయనిరాకరణ చట్రంలోనే సాగాయి. అయితే 1922-24లో నిరసన రూపం వలసవాద పోలీసులు, సైన్యంపై పూర్తి స్థాయి యుద్ధం రూపం తీసుకొంది. తదుపరి స్థాయిలోని తిరుగుబాటులోని గతితారక సూత్రాన్ని అర్థం చేసుకోవాలంటే రంప ప్రాంతంలో వలసపాలనలో గిరిజన తెగలు అనుభవించిన ప్రత్యేక బాధలను ముందుగా అర్థం చేసుకోవాలి. కొండల్లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1922-24 పోరాటం అక్కడే రూపుదిద్దుకుంది. : మొదటి భాగంలో వారిని నిరసనలకు సన్నద్ధం చేసిన వస్తుగత అంశాలపైనా, తదనంతరం కొండల్లో జబర్దస్తుగా సాగిన 'తెల్ల' పాలన ప్రజలపై సాగించిన దిగువ నుంచి ఒత్తిడి) అణచివేతపై ప్రత్యేక దృష్టిపెడుతూ బ్రిటీష్ పాలనలోని భిన్నమైన అటవీ సమస్యల మూలాల చరిత్రను మనం తెలుసుకుందాం. మేము ఇక్కడ మన్యం
ప్రాంత ప్రజల బాధల్లోని తీవ్రత స్వభావాన్ని చొరవ స్వరూపాన్ని అట్టడుగు స్థాయి నుంచి మన్యం తిరుగుబాటులోకి గిరిజనులు సంఘటితమైన స్థాయి గురించి వివరించేందుకు ప్రయత్నించాం. అప్పుడు అట్టడుగుస్థాయిలో వలసవాద వ్యతిరేక తిరుగుబాటుకు ప్రజా సామాజిక పునాదిని ఎత్తిచూపగలం. ఇక రెండవ స్థాయిలో మేము తిరుగుబాటులోని సామాజిక స్వభావం, రాజకీయ సిద్ధాతంపై అధ్యయనం చేయడం పైనే మా పరిశీలనను పరిమితం చేశాం. ఈ దశలో అల్లూరి సీతారామరాజు నాగించిన వలసవాద వ్యతిరేక తిరుగుబాటులోకి ప్రజలు సంఘటితమైన స్థాయిని......