₹ 200
నేను పెద్ద పెద్ద బుక్కులు చదివిన మేధావిని కాదు. పేదల బతుకులు చదువుతున్నోన్ని. ప్రభుత్వ ఆస్పత్రే నా గ్రంథాలయం. అక్కడున్న నిరుపేదలే నా పుసకాలు అంటున్న ' మానవత ' రక్తదాతల సంస్థ కన్వీనర్ ను.
ఇంట్లో కలర్ టీవీ ముందు కూచొని చుస్తే మన దేశం చాలా కలర్ ఫుల్ గా వుంటుంది. కానీ, ప్రభుత్వ ఆస్పత్రిలో తొంగిచూస్తే అర్థమైతుంది కలరా అయినా, కరువు కాటకాలు అయినా... మలేరియా అయినా, మత కల్లోలాలు అయినా.... చలిగాలులు అయినా, చేతబడులు అయినా.... చివరకు సమయానికి రక్తం అందక, వైద్యం అందక చచ్చేది రెక్కాడితే కానీ డొక్కాడని, తరతరాలుగా రకరకాలుగా మోసపోతున్న, పనిముట్టుగానే గని మనిషిగా ఏనాడూ గుర్తింపబడిన నిరుపేదలేననేది చేదు నిజం.
- తరిమెల అమర్నాథ్ రెడ్డి
- Title :Amar Humour, Amar Heart, Amar Talks
- Author :Tarimela Amarnath Reddy
- Publisher :Visalaandhra Publishing House
- ISBN :MANIMN1511
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :624
- Language :Telugu
- Availability :instock