టెన్సింగ్ నార్వే, ఎడ్మండ్ హిల్లరీ నడచిన దారి రెండు చేతులూ చాచి రా రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది. ఆకాశపు అంచుల్లో ఠీవిగా నిలబడ్డ ఎవెరెస్టు చూసి రావాలని అమర్ కల, ఈ ప్రయాణం చేయాలని నాలుగేళ్లుగా ఆతను కంటున్న కల. అల్లంత దూరంలో ఉంది, ఊరిస్తున్న ఆ కల. ఇప్పుడు అతని కల నిజం అవ్వబోతోంది.
ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాల్ని చూసి అబ్బురపడుతున్నాడు అమర్. అవి తనతో మాట్లాడుతున్నట్లే అనుభూతి చెందుతున్నాడు. 'మీరు అక్కడ ఎక్కడో ఉండి కవ్విస్తూ ఉంటే నేను ఊరుకుంటానా... వచ్చెయ్యనూ... ఇదిగో, మీ కోసమే వచ్చేస్తున్నా... ఎంత కష్టమయినా సరే... మీ దగ్గరకే వచ్చేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురయినా ఎదుర్కోడానికి సిద్ధమై వచ్చేస్తున్నాను. మిలమిలలాడే మీ పాదాలను తాకకుండా, ముద్దాడకుండా వెనక్కి వెళ్లనే వెళ్లను,' మనసులోనే మాట్లాడేసుకుంటున్న అమర్లో ఏదో తెలియని ఉద్వేగం, ఉత్సాహం. అప్పటికప్పుడు పక్షిలాగా ఎగిరి అక్కడ వాలాలని ఉందతనికి.
అపురూపంగా... అద్భుతంగా... స్వచ్ఛంగా... మెరిసే మంచు కొండల్లో.......................