బాల్యంలో విప్లవబీజాలు
అఖండ భారతావనిలో పంజాబ్ లైయల్లపుర్ జిల్లా బంగా సమీపంలో చాక్ నం. 105 గ్రామంలో, 1907 సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జన్మించారు. తల్లి విద్యావతి, తండ్రి కిషన్సింగ్లకు 'భగత్' రెండవ కుమారుడు. చాక్ నం. 105లో ఉన్న జిల్లా బోర్డు ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసం తరువాత లాహోర్ స్వామీ దయానంద సరస్వతి స్థాపించిన డిఎవి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి వరకు చదివారు. ఉగ్గుపాలలో మాతృభూమి భక్తి రంగరించబడిన ఆ కుటుంబం భగత్ జన్మించే నాటికి బ్రిటిష్ కిరాతక అణచివేతలు ఎదుర్కొంటూ శిక్షలు,
వేధింపులతో సతమతమయ్యేది. ఆంగ్లప్రభుత్వ బాల్యంలో భగత్ సింగ్ వ్యతిరేకత నరనరాల్లో జీర్ణించుకొన్న తండ్రి కిషన్ సింగ్, నేపాల్ ప్రవాసనం నుంచి పినతండ్రులు అజిత్, స్వర్ణసింగ్లు బర్మా మాండలే, ఇతర జైలు...........................