• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Amarajivi Balidanam Potti Sriramulu Poratagadha

Amarajivi Balidanam Potti Sriramulu Poratagadha By Dr Nagasuri Venugopal

₹ 200

పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసినదెందుకు?

.. ఆంధ్రరాష్ట్రమును గురించి బహుదీర్ఘకాల చర్చలు జరిగినవి. రాష్ట్రము అవసరమా, ఏర్పాటు చేయవచ్చునా అనే ప్రశ్నలు యిప్పుడు లేవు. ప్రభుత్వాలు, ప్రజలు, నాయకులు ఏకాభిప్రాయానికి (అనగా రాష్ట్రమును త్వరగా ఏర్పాటు చేయాలనే నిర్ణయం వచ్చారు. దేశం ఏకంగా వుండాలంటే ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, కలకత్తా మొదలగు ముఖ్యనగరాలు ఏ ఒక్క రాష్ట్రమునకు చెందకుండా కేంద్రప్రభుత్వమే పాలించాలి. ఈ నగరాల అభివృద్ధి దేశంలో నుండు అన్ని ప్రాంతాల ధనరాసులతో, రక్తముతో, బుద్ధితో జరిగినది. ఆర్థికవ్యవస్థ మారితే ఈ నగరాలు వస్తు సంగ్రహ ఆలయాల క్రింద వుండిపోతవి. అంతవరకు ప్రతిఒక్కడు, ప్రతిపల్లె యీ నగరాల మీద ఒకరకంగా ఆధారపడియున్నవి. కనుక ఎవరికి కూడా ఈ నగరాలలోని నిషేధముండరాదు...." పొట్టి శ్రీరాములు ప్రాయోపవేశ దీక్ష ప్రారంభించడానికి 34 రోజులు ముందు అనగా 1952 సెప్టెంబరు 15న 'ఆంధ్రరాష్ట్రం' పేరున నెల్లూరు నుంచి రాసిన విజ్ఞాపనావ్యాసంలో తొలుత కనబడుతాయి ఈ వాక్యాలు! (చూడుము : బలిదానం వై.ఎస్. శాస్త్రి, ఎ.సుబ్బరాయగుప్త.)

పొట్టి శ్రీరాములు ఆమరణ నిరశనదీక్షకు 1952 అక్టోబరు 19న మదరాసులోని మైలాపూరు ప్రాంతంలో బులుసు సాంబమూర్తి ఇంటిలో దిగేముందు ఏ కారణాల కొరకు దీక్ష పూనారో సుదీర్ఘమైన ప్రకటన చేశారు. ఇందులో 17 పాయింట్లు ఉండగా, అందులో 14 వాటిల్లో మద్రాసునగరం కీలక అంశంగా కనబడుతుంది. ఈ వివరాలు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఆంధ్రరాష్ట్ర అవతరణకు శ్రీరాములు దీక్ష చేశారనే అభిప్రాయం బహుళ వ్యాప్తిలో ఉంది. కానీ ఆయన కోరినది ఆంధ్ర రాష్ట్రానికి మదరాసు నగరం రాజధానిగా ఉండటం, అనంతరం మదరాసు నగరాన్ని ''సి' తరగతి రాష్ట్రంగా మలచడం! ఈ రెండు విషయాలు.................

  • Title :Amarajivi Balidanam Potti Sriramulu Poratagadha
  • Author :Dr Nagasuri Venugopal
  • Publisher :Andhra Pradesh Rastra Srujanatmakata & Samsruthi Samity
  • ISBN :MANIMN5734
  • Binding :Papar Back
  • Published Date :Aug, 2018
  • Number Of Pages :268
  • Language :Telugu
  • Availability :instock