• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Amaru Kaavyam
₹ 220

ఆమోదము

అర్థార్థినాం ప్రియా ఏవ అమరో దీరితా గిరః|

సారస్వతే తు సౌభాగ్యే ప్రసిద్ధి తద్విరుద్ధతా||

అమరులైన కవుల వాక్కులు అర్థమిచ్చేవి; సారస్వత సౌభాగ్యులకు (సరస్వతీ పుత్రులకు) అర్థం లేకపోవడం ఏమిటి? ఈ విరుద్ధం నిజమే. అమరుక కవి వాక్కులు మాత్రం అర్థాన్నిచ్చేవే సుమా!

అర్ధమ్ = శబ్దపు తెలివిడి; ధనము.

రసాభివ్యంజకము రసపరతంత్రము అయిన ముక్తపు సంఘాతపు రచన అమరుకము. కాశ్మీరదేశంలో శ్రీ జార్జి బ్యూలర్ (1837-1898)కు దొరికిన ప్రాచీన అమరుక శారదాలిపి ప్రతిలో కర్త పేరు విశ్వకర్మ అని లిఖింపబడినది. “విశ్వప్రఖ్యాత నాడింధమకులతిలకో విశ్వకర్మా ద్వితీయః.” నిర్ణయసాగర ముద్రణలో అమరుకకవి ప్రణీత శ్లోకాలు 162 ఇవ్వబడినవి. (ముద్రణలు 1889; 1900; 1929; 1954; పునర్ముద్రణలు ఢిల్లి 1883; వారాణసి 2008.)

అమరుకమునకు లభిస్తున్న ప్రధాన పాఠములు నాలుగు. అవి వేమ భూపాలుడిది, అర్జునవర్మదేవునిది, రుద్రదేవునిది, రవిచంద్రునిది. విమర్శకులు వేమభూపాలుడు సంతరించిన శృంగార దీపికా వాఖ్యతోడి అమరుక పాఠమే శ్రేష్ఠమని, మూలమునకు సన్నిహితమని పేర్కొన్నారు. ఈ నాలుగు ప్రధాన పాఠాలలో సమానంగా ఉన్న శ్లోకాలు 51 మాత్రమే. ఇదే మూలపాఠము (Ur Text). అమరుకకవి రచన శార్దూలవిక్రీడితంలో సాగినది. సంకలన కృతులలో విద్యాకరుని సుభాషితరత్నకోశము, శ్రీధరదాసుని 'సదుక్తి కర్ణామృతము',

శాబ్ధాధరుని 'శాబ్దాధర పద్ధతి', వల్లభదేవుని సుభాషితావళి', సూర్యకళింగరాజు 'సూక్తిరత్నహారము', హరకవి "సూక్తి ముక్తావళి', హరకవి 'సుభాషితహారావళి', యాక్టికరామకవి 'శృంగారాలాప | ముక్తావళి', లక్ష్మణభట్టు 'పద్యరచన', నిర్ణయసాగర ముద్రణశాల విద్యాంసులు సంతరించిన సుభాషిత రత్న భాండాగారములలో అమరుకకవి భావములకు ముకుర ప్రాయములైన శార్దూలవిక్రీడిత శ్లోకములు పెక్కులు కలవు. నిర్ణయసాగర ముద్రణలో............