• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Ambedkar Jeevita Charitra

Ambedkar Jeevita Charitra By Dr Katti Padmarao

₹ 600

డా|| కత్తి పద్మారావు

  1. రాజ్యాంగ అభిభాషణ - డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాసాలు - ఉపన్యాసాలు వాల్యూం - 17 మూడవ భాగం (అనువాదం-పీఠిక) వ్రాశాను. వ్రాసే క్రమంలో నేను అనేక గ్రంథాలు అధ్యయనం చేశాను. ఆ అధ్యయనం నుండి ఈ బృహత్తర గ్రంథ రూపకల్పన జరిగింది. ఈ గ్రంథాన్ని మొత్తంగా రెండు వేల పేజీలు వ్రాశాను. దీన్ని మూడు భాగాలుగా విభజించాను. మొదటి భాగం నా 69వ జన్మదినం జులై 2022కి తెస్తున్నాను. ఇది నా 78వ గ్రంథంలో నేను మొదటి చాప్టర్ లో అంబేడ్కర్ మూలాలు గురించి చర్చించాను. “మహర్లకు | రత్నగిరిజిల్లా కాణాచి 1911న జనాభా లెక్కల ప్రకారం ఒక్క బొంబాయిలోనే 153 ప్రత్యేక స్థావరాలు కలిగి ఉన్నారు. మహర్లు అనే నామవాచకం వలే మహరాష్ట్ర ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో వున్న అన్ని

గ్రామాల జీవన వ్యవస్థలకు మహర్లే పునాది వేశారు. అనేక సందర్భాలలో వచ్చిన మహర్ల ఉద్యమాలు మహారాష్ట్ర సంస్కృతిలో, పరిణామంలో భాగంగా నిలిచాయి. మహర్లు శక్తివంతమైన

జాతి, అతి ప్రాచీనకాలం నుండి వారి ఉనికి భారతదేశ మూలల్లో వుంది” అని నిరూపించాను ఇందుకు అనేక గ్రంథాలు | చదివాను. భారతదేశంలో మహర్లు శక్తివంతమైన జాతి. అంబేడ్కర్ లోని ఆ ధైర్య సాహసాలు వారి నుండి వచ్చినవే. అంబేడ్కర్ ఆత్మగౌరవం మహర్ల నుండి సంతరించుకున్నదే.

మహర్లలో ఈ ఆరు గుణాలు ఉన్నాయి. -
1. మహర్ అనే పదం నుంచి మహారాష్ట్ర ఏర్పడింది.
2. ఒకప్పటి 'మల్ల' రాష్ట్రం క్రమంగా మహరాష్ట్రమైంది.
3. ఆ ప్రజలకు నాటి నుండి నేటి దాకా ఆరాధ్యదైవమైన మల్లారి ఖండి పేరు నుంచి ఈ పదం ఏర్పడినది.
4. 'రసిక' అనే జాతి ప్రజల పేరు సంస్కృతీకరణ చెంది రాష్ట్రంలో దాని నుంచి రఠిక, మహరాష్ట్ర ఉత్పన్నమైనాయి.

  • Title :Ambedkar Jeevita Charitra
  • Author :Dr Katti Padmarao
  • Publisher :Lokayatha Prachuranalu
  • ISBN :MANIMN3623
  • Binding :Paerback
  • Published Date :July, 2022
  • Number Of Pages :657
  • Language :Telugu
  • Availability :instock