• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ame Kalipoyindi

Ame Kalipoyindi By Dr Rashid Jahan

₹ 150

క్వీన్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్

అవును ఉర్దూ సాహిత్య ప్రపంచపు సంపాదించుకున్న భారతీయ ప్రగతిశీల రచయిత్రి, మేధావి, కమ్యూనిస్ట్ నాయకురాలు, సాంస్కృతిక కార్యకర్త, ప్రజా వైద్యురాలు తన తోటి సాహిత్యకారుల వల్ల, మత ఛాందసవాదం వలన, బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వాల అణచివేతకు, విస్మృతికి గురైంది. ఆమె రాసిన చాలా కాలానికి కానీ ఆమె రచనలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు. అభ్యుదయ రచయిత్రిగానే కాదు తొలితరం కమ్యూనిస్ట్, డాక్టర్గా అదీ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురాలిగా గైనకాలజిస్ట్) కూడా ఆమె ప్రతిభ, సేవానిరతి నిర్లక్ష్యం కాబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ రకమైన జెండర్ వివక్షతకి దశాబ్దాలుగా రచయిత్రులు బలి అవుతూనే ఉన్నారు. ఒక వర్జీనియా వూల్ఫ్, మాయా ఏంజిలో, అమృతా ప్రీతం ఇంకా చాలామంది. అందులో భారతదేశ విభజన పూర్వ కమ్యూనిస్టు రచయిత్రి, డాక్టర్ అయిన డా. రాషిద్ జహాన్ ఒకరు.

రాషిద్ జహాన్ పర్దేకే పీచే' తెరవెనుక) నాటకాన్ని తెలుగులో అనువాదం చేసిన సామాజిక, సాంస్కృతిక కార్యకర్త రచయిత అయిన గౌరవ్ నన్ను ఆ నాటకానికి ముందు మాట రాయమని అడిగినప్పుడు నాకు తొలిసారిగా రాషిద్ జహాన్ గురించి, ఆమె అపురూపమైన రచనల గురించి తెలిసింది. చదివాక చాలా ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా ఆమె చైతన్యవంతమైన క్రియాశీల జీవితం, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆమె నిబద్దత, అణగారిన వర్గ ప్రజలపైన, పితృస్వామిక, మత ఛాందసవాదుల అణిచివేతకు గురి అవుతున్న ముస్లిం స్త్రీల సమస్యల పట్ల ఆమె కున్న అవగాహన, వారి విముక్తి పట్ల ఆమెకున్న ఆకాంక్ష చూసి ఆమెని ప్రపంచానికి పరిచయం చేయాలనిపించింది. దాదాపు అన్ని కథలను ఇంటర్ నెట్లో సేకరించాను. కొన్నింటిని హిందీ నుంచి తెలుగులోకి, మరి కొన్నింటిని ఇంగ్లీషు నుంచి తెలుగులోకి చేశాను. 'వే' కథ అనువాదం చేశాక వెంటనే 'ఉదయిని' వెబ్ పత్రిక ఎడిటర్ కుమార్ కూనపరాజు గారికి ఫోన్ చేశాను. తప్పకుండా వేద్దాము. పూర్తి అయ్యాక నేనే పుస్తకం వేస్తాను అన్నారు. చాలా సంతోషం అనిపించింది. పాఠకుల నుంచి అనువాదం, కథా..................

  • Title :Ame Kalipoyindi
  • Author :Dr Rashid Jahan
  • Publisher :Ennela Pitta
  • ISBN :MANIMN6001
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :141
  • Language :Telugu
  • Availability :instock