• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ame Suryudini Kabalinchindi

Ame Suryudini Kabalinchindi By A Krishna Rao

₹ 350

పెద్ద యుద్ధమే!

మాలతిలో ఉత్సాహం ముక్కలు ముక్కలై చుట్టూ ఎగిరి లోపల్లోపల ఆమెను కుదిపేసింది. ఆమె తలను రెండు వైపులా డోలులా ఎవరో బాదినట్లనిపించింది. భారీ కాయుడైన ఆమె క్లాస్ మేట్ భీకా ఒక దయ్యపు/రాక్షస డోలు వాద్యకారుడులా ఉబ్బిపోయి, తన పంజాలతో ఆమె తలపై తొలుత సున్నితంగా టట్ టట్ టట్ అని వాయించి తర్వాత డోల్ తాషా ఉత్సవంలో మాదిరి ధమ్ ధమా ధమ్ అన్న శబ్దం వచ్చేలా కర్రలతో బలంగా మోదసాగాడు.

ఇదంతా వారి కుస్తీ పోటీకి నాంది. ఒక రెల్లు చాపపై మగపిల్లలకు దూరంగా తన సోదరి కమలతో కలిసి కాళ్లు ముడుచుకుని కూర్చున్న మాలతి దేనిపైనా ఏకాగ్రత చూపలేకపోతోంది. ఆమె ఆగ్రహంతో తన పలకపై భీకా పేరు మాటిమాటికీ రాసి చెరిపేసింది. ఆ రోజు ఉదయం తరగతి గదిలోని 'అబ్బాయిల వైపు' వెళుతున్నప్పుడు గ్రామపెద్ద కొడుకు విసిరిన అవమానపు మాటల నుండి ఆమె ఇంకా తేరుకోలేదు.

'హద్దులు దాటడానికి మీకెంత ధైర్యం - లక్ష్మణరేఖ దాటతారా? అరవై మంది గోచీలు ధరించిన బలమైన యోధుల పాఠశాలలో ఇద్దరు లంగాలు ధరించిన పొట్టి అమ్మాయిలకు ఎంత ధైర్యం? మీ హద్దుల్లో ఉండండి. మా నాయకత్వం క్రింద అణగిమణిగి ఉండండి లేకపోతే...' యౌవనంలోకి అడుగుపెడుతున్నందు వల్ల వచ్చిన గీర గొంతులో ధ్వనిస్తుండగా వెటకారంగా భీకా హెచ్చరించాడు.

మాలతి ఎగతాళిగా నవ్వింది. 'లేకపోతే ఏంచేస్తావు? కమలకు, నాకు ఎలాంటి హద్దులు లేవు. మీ అరవై మంది వీరులకంటే మేము తెలివైనవాళ్లం. భీకా, మేము నిన్ను దేనిలోనైనా ఓడించగలం' అని మాలతి కోపంగా తిప్పికొట్టింది. తమ ఆడపిల్లల్ని తక్కువచేసి ప్రతి రోజూ చేసే దాడులను ఆమె ఇక భరించలేక పోయింది. 'అరే ఛా! అయితే నువ్వు మాతో కుస్తీ పట్టి మమ్మల్ని ఓడించగలవా?' అని భీకా ఎగతాళి చేశాడు.........................

  • Title :Ame Suryudini Kabalinchindi
  • Author :A Krishna Rao
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN6579
  • Binding :Papar back
  • Published Date :Oct, 2025
  • Number Of Pages :493
  • Language :Telugu
  • Availability :instock