• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Amma Kathalu

Amma Kathalu By Dr M Harikishan

₹ 100

క్రిష్ణవేణమ్మ కొడుక్కి కంగ్రాట్స్!

డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వసంచాలకులు.

"...ఎవడు కనిపెట్నాడో గానీ... ఈ పండుగలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా... ఏ మాత్రం పోలిక లేకుండా, బోర్ కొట్టకుండా భలేగుంటాయ్... ఆ నా కొడుకెవడోగానీ... వానికీ మానవజాతి ఎన్ని వేలసార్లు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకున్నా ఋణం తీరదు... ఏదేమైనా నమ్మకాలు కొంచెం కొంచెం సడలుతా వుంటి డబ్బులు అనవసరంగా తగలెయ్యడానికే ఈ పండుగలు అని ఇప్పుడు అనిపిస్తా వుంటాది గానీ... నిజానికి ఎన్ని వందల వేల రూపాయలు ఖర్చుపెడ్తా వస్తాది అంత ఆనందం...”. (ఉగాదులూ... ఉషస్సులూ...)

* నమ్మకముందా... లేదా... అనేది కాదురా ముఖ్యం. నేను చూడకపోతే నా కూతురి జీవితం చల్లగా వుంటాడంటే నాకంతకన్నా ఏం కావాల. నేను పన్న కష్టాలు నా కూతురు పడకుంటే చాలు...” (దేముడా... నా బిడ్డ సల్లగుండాల)

"... మళ్ళా వచ్చేటప్పుడు తక్కువ రేటుకి దొరుకుతాయని పెద్ద మార్కెట్లో కూరగాయలు కొని, ఒక చేత్తో కూరగాయల సంచీ పట్టుకోని, మరొక భుజానికి బ్యాగు తగిలించుకోని పాత న్యూస్ రీల్లో గాంధీ నడిచినట్టు చకచకా నడుస్తా వచ్చేది..."

(ప్రిన్స్ చార్లెస్... చార్లెస్ శోభారాజ్...) "... వయసొచ్చినాక సాకిన తల్లిదండ్రులనొదిలేసి పక్కకు పోయినట్టు ఈడొచ్చినాక తుంగభద్ర నొదిలేసి కెసికెనాల్ చేరుకున్నా. కాళ్ళకు నేల తగుల్తా వుంటే ఈదులాడ్డానికీ, ఏమీ తగలకుండా ఈదులాడ్డానికి తేడా వుంటాది. ఆడైతే ఎదురీత, మునిగీత, వాలీత, శవమీత అన్నీ కొట్టొచ్చు...". (దేముడు నన్నెందుకు బతికిచ్చినాడంటే)

నాలుగు కండ్లున్నోళ్ళని పోలీసుద్యోగంలోనికి తీస్కోరని తెలుసుకున్నరోజు నా కలలు ఏరుకోడానికి గూడా వీలులేనన్ని ముక్కలైపోయినాయి..." "...ఒక్కొక్క ముక్కా పూసగుచ్చి దండ కడితే కొంచెం కొంచెం అర్ధమయ్యేది".

"... ఇప్పుడు గనుక అయితే ఎగిచ్చి తందును ఆనాకొడుకుని. ఐనా ఈ పనికిమాలిన లోకానికి రాయి మీద రాయేడమే గానీ చేయందించడం తెలిసేడిస్తే గదా............................

  • Title :Amma Kathalu
  • Author :Dr M Harikishan
  • Publisher :Krishnaveni Publications
  • ISBN :MANIMN5767
  • Binding :Hard Binding
  • Published Date :Feb, 2023
  • Number Of Pages :72
  • Language :Telugu
  • Availability :instock