అమ్మ ఫోటో
"ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ముందు ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఊరి ప్రయాణం అవసరమా?" అంది మధు అత్తగారు శ్రీలక్ష్మి.
"చెప్పి చూశాను. వినలేదు. ఏమన్నా అంటే మూడు పాడైపోతుంది. వెళ్ళనీ" అంది మధు భార్య కళ.
తెల్లవారుజామునే ప్రయాణం. దారిలో తినడానికి ఇడ్లీలు, లంచ్కి పెరుగన్నం, పెద్ద కాన్లో మంచినీళ్లు ఇంకా కూల్ డ్రింకులు అన్ని రెడీ చేశారు. జాగ్రత్త జెట్లాగ్ తీరకుండానే హైరానా పడిపోతున్నారు. హెల్త్ పాడైతే కష్టం, మధ్యలో ఫోన్ చేస్తూ ఉండండి" అని వంద జాగ్రత్తలు చెప్పింది. కళ.
సరే అని కారెక్కాడు మధు.
" విజయవాడ వెళ్లి అక్కడి నించి వెళ్లాం సార్. కాస్త దూరమైనా ఇదే సుఖం. గుంటూరు రోడ్డు అంత బావుండదు అన్నాడు." డ్రైవర్. "నీ ఇష్టం అలాగే కానీ" అని సమాధానం చెప్పాడు మధు. 'ఇదే ఆఖరు ప్రయత్నం. దొరికితే సరే. లేకపోతే నాకు ప్రాప్తం లేదు అనుకుంటాను. ఏవిటో ఈ విచిత్రం. ఇలాటి అనుభవం ఎవరికీ కలుగదేమో' అనుకున్నాడు.
పక్కనే వున్న ఓ పుస్తకం తీసాడు. ఒక పేజీ తిప్పాడు. అందులో ఉంది ఓ గ్రూప్ ఫోటో. ఇంచుమించు 60 మంది ఉన్నారు ఆ ఫోటోలో. వెనక వరుసలో ఆడవాళ్ళు నిలబడి వున్నారు. ఆశగా వెతుక్కున్నాడు.
ఎవరు! ఇందులో ఎవరు? అనేదే ప్రశ్న. సమాధానం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
మధు చాలా ఏళ్ల కిందటే అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. కాకపోతే మాతృ భూమి అంటే చెప్పలేనంత మమకారం. తగని బంధు ప్రీతి ఉంది అతనికి.
రెండేళ్లకు ఒకసారి వస్తూనే ఉంటాడు. అతనికి అరవై ఏళ్లు నిండాయి. షష్టి పూర్తి ఇక్కడ చేసుకోవాలి అని సరదా పడ్డాడు. పిల్లలు కూడా సరే.................