గత యాభై సంవత్సరాలుగా ఆధునిక తెలుగు సాహిత్య రంగంలో నిర్విరామంగా కృషిచేస్తున్న అంపశయ్య నవీన్, ఇప్పటి వరకు 34 నవలలు, వందకు పైగా కథలు, వందకు పైగా సాహిత్య వ్యాసాలు, వందకు పైగా పుస్తక సమీక్షలు, ఇంగ్లీషులో “విన్సేట్స్ ఆఫ్ లైఫ్” పేరుతో 'ది హన్స్ ఇండియా' పత్రికలో ఫీచర్స్, “జీవనశైలి” పేరుతో ప్రజాశక్తి' పత్రికలో కాలమ్, ఆర్ట్ సినిమాల మీద వ్యాసాలు - ఇలా వివిధ ప్రక్రియల్లో నవీన్ గారు తన ప్రతిభను కనబర్చారు. ఈ సంవత్సరం ఆయన ఆశీతిపూర్తి సందర్భంగా ఆయన సృష్టించిన సాహిత్యంపై అనేకమంది విమర్శకులు చేసిన మూల్యాంకనంతో ఈ గ్రంథం వెలువడుతున్నది. అనేకమంది వ్యాసకర్తలు నవీన్ రచనల్లోని మంచిచెడ్డల్ని, అంతస్సారాన్ని విశ్లేషించారు. నవీన్ సాహిత్యంపై ఆసక్తి ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథం ఇది.