అంశుబోధిని పరిశోధకులకు ఒక వినతి
"అంశుబోధినీ..."
అనేక కారణాలచేత వివాద వలయంలో విలవిలలాడుతున్న విజ్ఞానశాస్త్ర గ్రంథం
1. దీనికి మొదటి కారణం, దీన్ని డిక్టేషన్ గా చెప్పిన యోగిగారు, గ్రంథం మొత్తం డిక్టేషన్ ఇవ్వకుండా, దీనిలో ప్రథమాధ్యాయాన్ని, విమాన శాస్త్రంలో ప్రథమాధ్యాయాన్ని మాత్రమే ఇచ్చారు. అందువల్ల రెండు గ్రంథాలూ అసంపూర్ణంగానే మిగిలిపోయాయి!
2. పేరుపరంగా చూస్తే "అంశుబోధినీ" అంటే "కిరణశాస్త్రము" అని అర్థం. ఎవరి కిరణాలు? అక్కడ స్పష్టత లేదు. పైగా ఈ దొరుకుతున్న భాగంలో కిరణచర్చ స్వల్పంగానూ, సృష్టిప్రారంభ చర్చ (కాస్మాలజీ) అధికంగానూ వుంది.
3. మూలగ్రంథం అని చెప్పబడే సూత్రాలకు, వాటిమీద "బోధాయన వృత్తి" అనే పేరుతో వున్న వ్యాఖ్యానానికీ, ఈ రెంటికీ కలిపి ప్రకాశకులు చేయించిన ఆంగ్లానువాదానికి, సొంతన అంతంత మాత్రంగానే వుంది.
4. సంస్కృత మూలంలో లేని విశేషాలు ఆంగ్లానువాదంలోకి ఎలా వచ్చాయంటే, "ఇవి మా గురువుగారు చెప్పిన వివరాలు" అని గ్రంథ సంపాదకుడైన సుబ్బరాయశాస్త్రిగారు చెబుతున్నారు.
5. భాషాపరంగా చూస్తే, శంకరాచార్యాదులు భాష్యపద్ధతిని అనుసరించాలనే తపన తప్పితే, భాషలో ఆ పటిష్టత కనిపించటంలేదు.
ఇలాంటి అనేక కారణాలవల్ల ఈ గ్రంథం వివాదగ్రస్తమైనప్పటికీ, ప్రచురితమైన ప్పటినుంచి ఇప్పటి దాకా ఇది వైజ్ఞానికుల దృష్టిని ఆకర్షిస్తూనే వుంది. ఎందుకంటే, దీని రచయిత భరద్వాజ మహర్షి అయినా కాకపోయినా, యోగి గారు దీన్ని డిక్టేషన్ చేసినా.........................