• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Amushmika Sopanaalu

Amushmika Sopanaalu By Dr Vemuri Sitaramaiah

₹ 500

గూడవల్లి చంద్రయ్య గారి నుండి
గురు దేవులు చిన్మయానందుల సంస్థగా మారిన
“నందమూరు శ్రీ సీతారామాశ్రమ" ప్రస్థానము

(డా. వేమూరి సీతారామయ్య గారి ఆధ్యాత్మిక కేంద్రము)

సద్గురు మూర్తి - డా॥ వేమూరి సీతారామయ్య గారు :

బ్రహ్మశ్రీ వేమూరి సీతారామయ్య గారు కీ.శ. 1901వ సంవత్సరములో సాంప్రదాయక వైదిక కుటుంబములో శ్రీ వేమూరి విశ్వనాథము - శ్రీ సోమి దేవమ్మలకు జ్యేష్ఠ పుత్రునిగా జన్మించారు. వారికి కుటంబ వాతావరణానికి తోడు ప్రాక్తన జన్మ విద్యగా ఆధ్యాత్మికత అలవడింది. విద్యార్థి దశ నుండీ జిజ్ఞాసువుగా ఉండేవారు. వ్యక్తికి, విశ్వానికి ఉండే అనుబంధమును గూర్చి తాను పరిశీలించిన విషయాలు, తనకు ఏర్పడిన భావనలను ఎప్పటికప్పుడు తన డైరీలో రాసుకొనేవారు. విశాఖ పట్టణములో వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత 1926వ సంవత్సరంలో కృష్ణా జిల్లా, కైకలూరు మండలంలోని ఒకానొక గ్రామానికి వైద్యునిగా నియమితులైనారు. అనంతరం వారు 1927వ సంవత్సరంలో 'మానికొండ గ్రామానికి బదిలీ అయినారు. ఆ గ్రామంలోని వారి మిత్రులు శ్రీ అనుముల నరసింహం గారి ద్వారా 1928వ సంవత్సరం వారికి ఆ గ్రామానికి విచ్చేసిన సద్గురువులు, బ్రహ్మ విద్యోపాసకులు అయిన బ్రహ్మశ్రీ పాలావఝల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి సన్నిధి లభించినది. (వివేకానందునికి శ్రీ రామకృష్ణ పరమహంస లభించినట్లుగా). జిజ్ఞాసువులుగా వీరికి ఏర్పడిన అనేక సందేహాలను వారు చాలా సునాయాసంగా తీర్చగలిగారు. అప్పటి నుండి ముముక్షువులుగా పరిణితి చెందిన డా॥సీతారామయ్య గారు 1930వ సంవత్సరంలో గురువుల నుండి తత్వోపదేశము పొందిరి. వారితో పాటు వారి సహధర్మచారిణి అయిన శ్రీమతి పార్వతమ్మగారు కూడా తత్వోపదేశము పొందిరి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ.............

  • Title :Amushmika Sopanaalu
  • Author :Dr Vemuri Sitaramaiah
  • Publisher :Sri Vemuri Ramohanarao
  • ISBN :MANIMN3971
  • Binding :Hard Binding
  • Published Date :2022
  • Number Of Pages :576
  • Language :Telugu
  • Availability :instock