₹ 150
ఆమె హత్యానేరం మీద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ... తన పేరు చెప్పినా ఆమె ఎవరో ఎవ్వరికి తెలియదు... అనామకురాలు... ఎత్తుగా కన్పిస్తున్న జైలు గోడలు.... కత్తిరించిన ముక్కలా కనిపించే కొద్దిపాటి ఆకాశం.... బ్యారక్ లో తోటి ఖైదీల వికృత ప్రవర్తన... ఆమెకు ఊపిరాడటం లేదు. ఎవ్వరితో మాట్లాడాలనిపించడం లేదు. ఎవరైనా పోట్లాడినా బదులివ్వాలనిపించడం లేదు.
గదిలో ఉన్నంతసేపు ఉక్కపోతగా ఆలోచనలు ఏవేవో జ్ఞాపకాలు...... మెదడుని కుమ్మరి పురుగులా తొలుస్తూ గుర్తుకొస్తున్న అనేకానేక సంఘటనలు... గడిచిపోయినా జీవితమంతా కళ్ళముందు రిమైండ్ అవుతూ... ఒంటరితనం మరి భయపెడుతుంది. దాన్నుంచి దూరంగా పారిపోవడానికి తన జ్ఞాపకాల్ని రాద్దామనుకుంది. ఆత్మకథ రాసుకునేంత గొప్ప జీవితం కాదు ఆమెది. పదునుగా గుచ్చుకునే ఆలోచనలతో మనసుని గాయం చేసుకోవడం కంటే వాటిని కాగితం మీద పెడితే బావుంటుందేమోనని రాసుకున్న డైరీ... అనామిక డైరీ...
- Title :Anaamika Dairy
- Author :Saleem
- Publisher :Sri Vijayalakshmi Publications
- ISBN :MANIMN0886
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :208
- Language :Telugu
- Availability :instock