• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Anaganaga Oka Chitrakarudu

Anaganaga Oka Chitrakarudu By Anwar

₹ 275

ఒక రోజు వస్తుంది! అప్పుడు వేళ్ళు వుండేవి, గీయవలసిన బొమ్మలన్నీ గీయ వలసింది! నడక వుండేది, నడవవలసిన దారులన్నీ నడవవలసింది! చేతులు వుండేవి, కలిసిన ప్రతి చేతినీ అపురూపంగా చేతుల్లోకి తీసుకోవలసింది! నడవాల్సిన దినాల్లో నడుమును పడక్కి ఆనించి పెట్టాను. అదే సుఖమనుకున్నా. ఈ రోజు చిన్ననడక కోసం తపించిపోతున్నా. కాని నడవడానికి కాళ్ళేవి? అందులో బలమేది?

అపురూప0

గీస్తున్న గీత చేరవలసిన గమ్యం తాలుకు విసురులో ఏ మాత్రం తొట్రు పడినా నన్ను భారం కమ్ముకుంటుంది. అనేకానేక ఆలోచనల మధ్య తాత్కాలికంగా విషయం మరిచిపోయినా దాని తాలూకు బరువు రోజంతా వెంటాడుతూనే వుంటుంది. ఇది దేని తాలూకు వేదనబ్బా అని పనిగట్టుకు వెనక్కు వెళ్ళి దుఃఖాన్ని మళ్ళీ తొడుక్కుంటాను. ఉపశమనం కోసం కుదరని బొమ్మను మళ్ళీ మళ్ళీ కుదర్చడానికి ప్రయత్నిస్తాను. అప్పటికీ కుదరకపోతే చివరకి బొమ్మ ముక్కలు ముక్కలుగా చిరిగి పోతుంది కాని, అది చేసిన గాయం?

కుదిరిన బొమ్మల తాలూకు అనుభూతులు ఎప్పుడూ గుర్తు వుండి చావవెందుకో! అపజయాల్ని మళ్ళీ మళ్ళీ వెతుక్కుని మరొక అపజయం కోసం సిద్ధమైన వాడ్ని నా కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా అన్వర్ అనే అంటారేమో!

బొమ్మల పట్ల ఎందుకని నీకంత జాగ్రత్త, ఏమిటా అపురూపం అని అడిగితే ఒక్క బొమ్మలే కాదు, ప్రపంచంలో ప్రతీది అపురూపంగా ఫీలయ్యే సెన్స్ని పెంచుకోవాలని అనుకుంటాను. రోజుకు ఎన్నిసార్లు ఎంతమందికి థేంక్స్ చెబుతావు? థేంక్స్ చెప్పినపుడు నిజంగా ఆ కృతజ్ఞత హృదయంలోంచి బయల్దేరి గొంతులోంచి మెత్తగా ఎదుటి వారిని తాకుతుందా! థాంక్ యు... ఎంత కరుణ.................

  • Title :Anaganaga Oka Chitrakarudu
  • Author :Anwar
  • Publisher :Rekha Yatra Prachurana
  • ISBN :MANIMN6192
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2019
  • Number Of Pages :252
  • Language :Telugu
  • Availability :instock