• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anaganaga Oka Ramam

Anaganaga Oka Ramam By Avadhanula Vijayalakshmi

₹ 450

అనగనగా ఒక రామం

ఒక పెద్ద భవన నిర్మాణం జరగాలంటే పునాదులు లోతుగా తవ్వాలి, సరైన పాళ్ళలో ఆ పునాదుల్లో కాంక్రీటు పొయ్యాలి, గోడలు ఏమాత్రం వాలిపోకుండా తిన్నగా ఉండాలి, భవనంలోని ప్రతి పిల్లర్కీ తన పైన మోపే బరువుని తట్టుకొనేంత దృఢత్వం ఉండాలి, లోపల నివసించే మనుషులకి గాలీ వెలుతురూ ధారాళంగా ఉండేట్లు తలుపులు, కిటికీలూ ఉండాలి...

అలా తన జీవితాన్ని ఒక అద్భుతమైన బహుళ అంతస్థుల భవనంలా మార్చుకొన్న ఒక మనిషి జీవనయానం ఈ కథ...

ఒక కార్మికుడి నుండి జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగిన ఒక మధ్యతరగతి మనిషి కథ..

రోళ్ళు బద్దలయ్యే రోహిణీ కార్తె....

వేడిగాడ్పులు ఈ చెవిలోంచి ఆ చెవిలోకి ఈడ్చికొడుతున్న మధ్యాహ్నం వేళ.... కాకులు కూడా ఉన్న కాసిని చెట్లలో ఎక్కడో కొమ్మల మధ్య దాక్కున్న వేళ... అక్కడంతా బొగ్గు... నల్లని బొగ్గు... గుట్టలు గుట్టలుగా బొగ్గు....

చిన్న బంతి పరిమాణంలోంచి ఒక పెద్ద బస్తా పరిమాణం దాకా రకరకాల సైజుల్లో బొగ్గులు...

బొగ్గుల పోగులు... కాదు... బొగ్గులు గుట్టలు...

కనుచూపు మేరంతా పరుచుకొన్న ఆ రాక్షసి బొగ్గుల రాశుల్ని చూసి, ఆ సౌందర్య రాహిత్యానికి కోపంతో ఒళ్ళు మండిన వాయుదేముడు నిప్పుల్ని చెరిగి పోస్తున్నాడు!...............

  • Title :Anaganaga Oka Ramam
  • Author :Avadhanula Vijayalakshmi
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6603
  • Binding :Papar back
  • Published Date :Sep, 2025
  • Number Of Pages :592
  • Language :Telugu
  • Availability :instock