• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

ANANDANUBHUTI UTPADAKATA ( Feel- Good Productivity)

ANANDANUBHUTI UTPADAKATA ( Feel- Good Productivity) By Ali Abdaal

₹ 399

అధ్యాయం

ఆట

కా గితం మీద ప్రొఫెసర్ రిచర్డ్ ఫేన్మన్ ఉద్యోగ ప్రగతి పరిపూర్ణంగా ఉన్నది. ఆయన వయసు కేవలం ఇరవై ఏడు ఏళ్ళు. అప్పటికే ఆయన తన తరంలో భౌతిక శాస్త్రవేత్తలలో మహామహులుగా ప్రస్తుతి పొందారు. న్యూక్లియర్ శక్తి సంభావ్యతను నియంత్రణ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని కార్నెల్ యూనివర్సిటీలో అందరికన్నా పిన్నవయస్కులైన ప్రొఫెసర్ గా నియమితులయ్యారు.

కాని ఇక్కడ ఒక సమస్య ఎదురయింది. ఫిజిక్స్ అంటే ఆయనకు బోర్ కొట్టింది.

ఈ సమస్య 1940 దశాబ్దం మధ్యలో మొదలయింది. ఆలోచించటానికి కూర్చున్నపుడల్లా ఆయనకు అలసట కలిగేది.1945 జూన్ లో, రెండవ ప్రపంచ యుద్ధం మరికొన్ని నెలలలో ముగుస్తుందనగా, ఆయన శ్రీమతి ఆర్లిన్ క్షయవ్యాధితో మరణించారు. ఆమె అస్తమయానంతరం ఆ యువ ఆచార్యుల జీవితంలో సంగీతం సన్నగిల్లి క్రమంగా అంతరించింది. డాక్టోరల్ విద్యార్థిగా ఆయనలో చైతన్యం నింపిన భావనలు ఈనాడు మందకొడిగా, జీవచ్చవాలలా తోస్తున్నాయి. విద్యాబోధనలో ఆయన ప్రవీణులు. కాని ఈనాడు ఆ పని ఆయనకు కూలిపనిలాగా తలనొప్పి పుట్టిస్తున్నది. “నాలోని శక్తి అంతా నేనే దగ్ధం చేశాను.” తర్వాతి రోజులలో ఆయన స్మరించారు.

“నేను లైబ్రరీకి వెళ్లి అరేబియన్ నైట్స్ పూర్తిగా చదివే వాడిని.” ఆయన వ్రాశారు. "కాని పరిశోధనకు సమయం అయినప్పుడు, నాకు పనికి వెళ్ళ బుద్ధి వేసేది కాదు. నాకు ఆసక్తి లేకపోయింది.”

ఏమీ చేయకుండా కూర్చోవటం సులభమని ఆయన కనుక్కున్నారు. అప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్లకు చదువు చెప్పటమంటే ఆయనకు ఇష్టమే. లైబ్రరీలో కూర్చొని చదవటం, యూనివర్సిటీ ఆవరణలో తిరగటం కూడా ఆయనకు ఇష్టమే. పనిచేయటమంటే మాత్రం ఆయనకు గిట్టేది కాదు. 1940 దశాబ్దం చివరిలోకి................

  • Title :ANANDANUBHUTI UTPADAKATA ( Feel- Good Productivity)
  • Author :Ali Abdaal
  • Publisher :Manjul Publishing House
  • ISBN :MANIMN6386
  • Binding :Papar Back
  • Published Date :2023
  • Number Of Pages :225
  • Language :Telugu
  • Availability :instock