• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anantam
₹ 70

ఫిరంగిలో జ్వరం

సెప్టెంబర్ 11వ తేదీ.... వెంకటనాయుడి తోటలో వెయ్యికిపైగా చీనీ చెట్లను రాత్రికి రాత్రే ఎవరో నరికేశారనే వార్త ఇంకా పూర్తిగా తెల్లవారకముందే వరదలా ఆ ఊరిని ముంచివేసింది. చీనీ చెట్లతోపాటు వ్యవసాయ మోటార్లను పేల్చివేశారనీ, ఒక ట్రాక్టర్ను కూడా పెట్రోల్ పోసి తగులబెట్టారనీ, అంచెలంచెలుగా చుట్టూ వున్న పల్లెల ప్రజలందరికీ బారెడు పొద్దెక్కక ముందే తెలిసిపోయింది. అంతే వెంకటనాయుడి తోట తిరుణాలలా మారిపోయింది. ఈ దారుణాన్ని కళ్ళారా చూస్తూ “ఎవుడికేం పొయ్యేకాలం వచ్చిందర్రా పచ్చని చెట్లను నిలువునా నరికివేసినారు. వెంకటనాయుడి మింద కోపం ఉంటే ఆయప్ప మింద తీర్చుకోవల్ల. పాపం చెట్లేం చేసినాయి” అని కొందరూ, "ధైర్యముంటే నాయుడిని ఎదుర్కోవల్ల. ఇది పూర్తిగా పిరికిచర్య" అని మరికొందరూ, "ఇంకా రెండు కాతలు కూడా పూర్తి కాయలే. దీండ్లకోసం నాయుడు ఎంత ఖర్చు పెట్టె. నీళ్ళు చాలకపోతే ఎన్ని బోర్లు వేయించె" అంటూ సానుభూతితో కొందరూ, "నేననుకుంటానే ఉండా. ఇట్లాంటి గతి ఎప్పుడో ఒకప్పుడు నాయుడికి పడుతుందని” అని గొణుక్కుంటూ కొందరూ, “చూసినాం లేప్పా, నాయుడేం తక్కువ తిన్నాడా? ఈయప్ప ఎంతమంది గడ్డివాములు కాల్పిలేదు! ఎందరి చెట్లు నరికీలేదు. ఇంక మనుషుల్ని యాటికాటికి కీళ్ళు ఇరిపీలేదు. చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత” అంటూ వెనకటివన్నీ తిరగదోడుకుంటూ కొందరూ రకరకాల వ్యాఖ్యానాలతో తోట నిండా మూగి వున్నారు.

ఇక పత్రికల రిపోర్టర్లు, సిటీ కేబుల్వాళ్ళూ, కెమేరాలతోనూ, వీడియోలతోనూ జరిగిన ఘోరకాండనంతా బహు భంగిమల్లో దృశ్యీకరిస్తున్నారు. ఎవరేం చెప్పినా చకచకా రాసేసుకుంటున్నారు.

హైదరాబాద్ లో ఉన్న వెంకటనాయుడు ఈ వార్త విన్న మరుక్షణం ఉరకలు పరుగులతో తన అనుచరగణం వెంటరాగా, మధ్యాహ్నానికల్లా ఊరు చేరుకున్నాడు....................

  • Title :Anantam
  • Author :Singamaneni Narayana
  • Publisher :Vishalandra Publishing House
  • ISBN :MANIMN5768
  • Binding :Papar Back
  • Published Date :March, 2016 2nd print
  • Number Of Pages :109
  • Language :Telugu
  • Availability :instock