• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Andaman Dairy

Andaman Dairy By Dasari Amarendra

₹ 120

పచ్చల ద్వీపాలూ - ముత్యాల మడుగులూ

-- సి. భాస్కరరావు

సంజీవదేవ్ అంటారు, 'Travel Imparts Education,' అని.

అవును, యాత్ర జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. సంవత్సరానికి ఒకసారైనా విజ్ఞాన, వినోదయాత్రలు చెయ్యడం మానసిక వికాసానికి, ఆరోగ్యానికి మంచిది. యాత్రలు చెయ్యటానికి ఉపయోగపడే యాత్రాసాహిత్యం ఆంగ్లంలో ఉన్నంతగా తెలుగులో లేదు. తెలుగులో యాత్రాసాహిత్యం అంటే మొదటగా గుర్తుకొచ్చేది ఏనుగుల వీరాస్వామి, యం. ఆదినారాయణ, మల్లాది వెంకట కృష్ణమూర్తి, పరవస్తు లోకేశ్వర్. ఈ జాబితాకి ఇప్పుడు, దాసరి అమరేంద్రను కూడా కలుపవచ్చు. అమరేంద్ర యాత్రాసాహిత్యం మూడు నగరాలు, స్కూటర్లపై రోహతాంగ్ యాత్ర, ఆత్మీయమ్ పుస్తకంలోని యాత్రారచనలు- ఇంకా ఇప్పుడు అండమాన్ డైరీ. రాసినవి ఇవేగానీ ఇంకా వీరి కలం నుంచి ఆస్ట్రేలియా, ఇండోనేసియా, అమెరికా లాంటి ఎన్నో యాత్రాస్మృతులు రావలసి ఉన్నాయి. భారతదేశాన్ని వర్ణిస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అని అంటుంటారు. కాని భారతదేశపు నిజమైన దక్షిణకొస, నికోబార్ ద్వీప సముదాయంలోని 'గ్రేట్ నికోబార్' ద్వీపంలో ఉన్న 'ఇందిరా పాయింట్'.

అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న ద్వీపాల సంఖ్య 572. అయితే వీటిలో 36 ద్వీపాలలో మాత్రమే జననివాసం ఉంది. అంటే 94 శాతం దీవులు మానవ విధ్వంసం లేకుండా పచ్చగా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ దీవులలో నాలుగు నెగ్రిటో మరియు రెండు మాంగలాయిడ్ తెగలు ఉన్నాయి. నెగ్రిటో సముదాయినికి చెందిన గ్రేట్ అండమానీస్, ఓంగె, జారవా, ఇంకా సెంటినలిలు నేటికీ వేట ద్వారానే తమ ఆహారాన్ని పొందుతున్నారు. మారిన కాలానికనుగుణంగా నికోబారీలు (మాంగలాయిడ్ తెగ) మారి, నాగరికులై, అభివృద్ధి సాధించారు..............

  • Title :Andaman Dairy
  • Author :Dasari Amarendra
  • Publisher :Alambana Prachuranalu
  • ISBN :MANIMN6037
  • Binding :Paerback
  • Published Date :Dec, 2024 2nd print
  • Number Of Pages :128
  • Language :Telugu
  • Availability :instock