• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Andaniki Avala

Andaniki Avala By Kumari R Jayasri Kasikar

₹ 100

అందానికి ఆవల

O.S. కృష్ణమూర్తి

ఉదయం తొమ్మిది గంటలు డాక్టర్ జయంతి ఆసుపత్రికి వెళ్ళే సమయం. పోర్టికోలో డ్రైవర్ కారును సిద్ధం చేసి, ఆమె కోసం వేచియున్నాడు. కారులో కూర్చునే సమయంలో జయంతి అందాన్ని వీక్షించటానికి చుట్టుపక్కలవాళ్ళు - స్త్రీలు, పురుషులు, పిల్లలు - ఇళ్ళలో నుండి బయటకు వచ్చారు. రోజూ కనిపించే దృశ్యమే ఇది !

జయంతిని చూచిన వారిలో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది అందరిని తన చిరునవ్వుతో పలుకరించి ఆమె కారులో ఆసుపత్రికి వెళ్తుంది. అత్యంత సౌందర్యవతియైన డాక్టర్ జయంతిని కొన్ని క్షణాలు చూచిన వెంటనే అందరికి ఏదో తెలియని ఆనందం, తృప్తి కలుగుతుంది.

కూతురు జయంతి వెళ్ళడం చూస్తూ యింటి గుమ్మం వద్ద నిలబడ్డారు గౌరి. తన కూతురు అందానికి పరవశులయ్యే వారిని చూసి ఆమె భయపడటం సహజమే కదా! జయంతికి 28 సంవత్సరాల వయస్సు వచ్చినా మంచి సంబంధం చూసి వివాహం చేయలేకపోయానే అని ఆమె బాధపడుతుంది. అమ్మాయి పెళ్ళి విషయం గురించి తన భర్తతో ప్రస్తావించినప్పుడు ఆయన - "ఆమె కోసం ఒక అందగాడు ఎక్కడో పుట్టే ఉంటాడు. ఆమెకేం తక్కువ ? తొందరలోనే పెళ్ళవుతుంది. బాధపడకు" - అని సమాధాన పరుస్తారు.

జయంతి డాక్టర్ పట్టాతో పాటు గోల్డ్మెడల్ అందుకున్న రోజు ఆ తల్లి స్మృతిపథములో ఈ సంభాషణ కదలాడింది - సభలో గవర్నర్ గారు, డీన్ మరియు యితర ప్రొఫెసర్లు ఆసీనులై యున్నారు. డీన్ గారు మాట్లాడుతూ “డాక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆమెను చూచిన వెంటనే రోగుల వ్యాధి సగానికి పైగా నయమౌతుంది. మిగిలిన సగానికి మాత్రమే ఆమె వైద్యం చేయవలసి ఉంటుంది.” అని పొగిడారు.

గవర్నర్గా గారు జయంతికి బంగారు పతకం బహూకరించినప్పుడు కరతాళ ధ్వనులతో మారు మ్రోగింది సభ. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత జయంతి బంగారు పతకాన్ని దేవుని పటం ముందు పెట్టి నమస్కరించి, తల్లి తండ్రులకూ నమస్కరించింది..............

  • Title :Andaniki Avala
  • Author :Kumari R Jayasri Kasikar
  • Publisher :Kumari R Jayasri Kasikar
  • ISBN :MANIMN4203
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :68
  • Language :Telugu
  • Availability :instock