• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Andariki Nyayam

Andariki Nyayam By Tadakamalla Muralidhar

₹ 150

తెలంగాణ న్యాయవ్యవస్థ : నాడు - నేడు

నిజాం పరిపాలనలోని హైదరాబాదు రాష్ట్రానికి హైదరాబాద్ దక్కన్) సంబంధించి ప్రస్తుతమున్న హైకోర్టు బిల్డింగును ఆ నాటి నిజాం 1919 సంవత్సరంలో విశాలంగా కట్టించి ఆరుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ఆఫ్ హైదరాబాదును ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో మూసీ వైపు ఉన్నటువంటి గేటు ప్రధాన ద్వారంగా ఉండేది. హైదరాబాదు సంస్థానం భారత ప్రభుత్వంలో 1948లో విలీనమైన తర్వాత కూడా హైకోర్టు ఆఫ్ హైదరాబాద్ గానే పిలువబడేది.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రంలోని ప్రస్తుత తెలంగాణ ప్రాంతం విలీనమై ఆంధ్రప్రదేశ్ గా 1956 లో ఏర్పడినప్పుడు, మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి గుంటూరులో ఏర్పాటు చేయబడిన ఆంధ్ర హైకోర్టు హైదరాబాదు హైకోర్టులో విలీనమై హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 లో 12 మంది జడ్జిలతో అవతరించింది.

రెండు రాష్ట్రాల విలీనం నాటికి హైకోర్టు ఆఫ్ హైదరాబాదులో జస్టిస్ సయ్యద్ ఖమర్ హుస్సేన్, మనోహర్ పర్షాద్, మహమ్మద్ అహ్మద్ అన్సారి, శ్రీనివాసచారి, పి. జగన్మోహన్ రెడ్డి, ఎన్. కొమురయ్యలు న్యాయమూర్తులుగా 1943 - 1955 మధ్య కాలం నుండి పని చేస్తున్నారు.

రెండు హైకోర్టుల విలీనం కూడా తెలంగాణ న్యాయమూర్తుల పట్ల వివక్షతో మొదలైంది. ఆంధ్ర హైకోర్టులో 1953 తర్వాత నియమింపబడ్డ న్యాయమూర్తులు, హైదరాబాద్ హైకోర్టులో ముందుగా నియమింపబడ్డ న్యాయమూర్తుల కంటే సీనియర్లుగా ప్రకటింపబడ్డారు. అప్పటినుండే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ పట్ల వివక్ష చూపించాయి..............................

  • Title :Andariki Nyayam
  • Author :Tadakamalla Muralidhar
  • Publisher :Pala Pitta Books Hyd
  • ISBN :MANIMN6277
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :136
  • Language :Telugu
  • Availability :instock