ఆంధ్ర మహాభారతం: అమృతత్వ సాధనం
"హితేన సహితం సాహిత్యం" హితాన్ని చేకూర్చేది సాహిత్యం, సమాజ హితానికి దోహదపడేది సాహిత్యం. సాహిత్యం యొక్క ప్రయోజనమూ అనంతమే, పరిధీ అనంతమే. ఒక కాలం నాటి సాహిత్యం మరొక కాలానికి ఉపయోగపడదు అనుకుంటే పొరపాటు. తరాలు మారినా, యుగాలు మారినా సాహిత్యం ఎప్పుడూ హితాన్నే కోరుకుంటుంది. సాహిత్యం యొక్క ప్రాథమిక లక్ష్యమూ అదే, పరమార్థం కూడా అదే. ఈరోజు ఆధునికం అనుకున్నది కొంతకాలానికి ప్రాచీనమవ్వక తప్పదు. ఒక కాలంలో వెలువడిన సాహిత్యం ఆ కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టినా, ఎన్నో కాలాలకు అది మార్గదర్శకమే అవుతుంది.
కాలంతో పాటు కలం ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. భౌతిక, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు ఆ కలం యొక్క కదలికని ఎప్పటికప్పుడు ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆ పరిస్థితులకి అనుగుణంగా కలం గళమెత్తుతుంటుంది. అయితే, ఒక నాటి అనుభవాలకు, చరిత్రకు సాక్షిగా నిలుస్తూ, విలువలను అందిస్తున్న సాహిత్యాన్ని ఆధునికత పేరుతో విస్మరిస్తే మనిషి తాను కూర్చున్న చెట్టు కొమ్మని తానే నరికేసుకున్నట్టే అవుతుంది. "పాత క్రొత్తల మేలు కలయిక క్రొమ్మెరంగులు చిమ్మగా..." అని మహాకవి గురజాడ పలికినట్టు సాహిత్యంలో కూడా పాత కొత్తల మేళవింపు అవసరం.
సృష్టిలో ఎటువంటి లోపం లేదు. మనిషి దృష్టిలోనే లోపం ఉంది. మనిషి ఏ కోణంలో సృష్టిని దర్శిస్తే ఆ కోణంలో సృష్టి ఆవిష్కృతమౌతుంది. ప్రాచీన తెలుగు.................