• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Andhra Satavahanula Aswamethayagamu

Andhra Satavahanula Aswamethayagamu By Kavikondala Chadradaram

₹ 150

  1. విష్ణుర్వైయజ్ఞః

"విష్ణుర్వైయజ్ఞః ! విష్ణువే యజ్ఞస్వరూపం! యజ్ఞంచేసే మహారాజు చేయించే ఋత్విజుడు విష్ణువే! యజ్ఞంలో అర్పించే హవిస్సు యజ్ఞంలో బలిఇచ్చే అశ్వము ఆయనే!"

ఈ విషయం అశ్వమేధయాగం చేయించే ఋత్విజుల్లో మధుస్ఛందుడు ఆంధ్రశాతవాహన రాజదంపతులకు చెబుతున్నాడు. చక్రవర్తి శాతకర్ణి, మహారాణి నాగానికాదేవి లతోపాటు మహామంత్రి మల్లనామాత్యుడు కూడ అధ్వర్యుడు చెప్పేవిషయం శ్రద్ధగా వింటున్నారు.

అది శాతవాహనయుగం.

అప్పటికి కలియుగాది మూడువేల సంవత్సరాలు గడిచిపోయాయి. కపిలవస్తు నగరంలో బుద్ధభగవానుడు అవతరించి మూడువందల సంవత్సరాలు గడిచింది. గ్రీకు వీరుడు అలగ్జాండర్ భారతావనిపై దండెత్తి నూటయాభయి సంవత్సరాలు గడిచింది. ఆంధ్రశాతవాహనులు దక్షిణభారతదేశాన్ని ప్రతిష్ఠాన మహానగరం రాజధానిగా పరిపా లిస్తున్నారు. ఆంధ్రశాతవాహనుల తొలి రాజధాని కృష్ణాతీరంలోని శ్రీకాకుళం. రాజదంపతులు ఇంతకు ముందు శ్రీకాకుళంలో అజ్ఞాథేయము అనేయాగాన్ని చేశారు. వీరి రెండవ రాజధాని ధాన్యకటకం. అమరావతి ధాన్యకటకం రెండు కృష్ణాతీరంలోని జంటనగరాలు. శాతకర్ణి మహారాజు రాణి నాగానికాదేవి అమరావతిలో తమ మొదటి అశ్వమేధయాగం చేశారు. శాతవాహనులు తృతీయ రాజధాని ప్రతిష్ఠానమహానగరం. రారాజులందరినీ జయించి శాతవాహనులు రాజసూయయాగం చేశారు. ఇప్పుడు అంజనేరీలొ రెండవ అశ్వమేధయాగం తలపెట్టారు.

అంజనేరి గ్రామం సహ్యాద్రి పర్వతాలలోని నాసికా క్షేత్రానికి త్రయంబక క్షేత్రానికి మధ్య వుంది. త్రయంబక క్షేత్రం గోదావరీనదికి పుట్టినిల్లు సహ్యాద్రి పర్వతాలలోని అంజనేరి హనుమంతునికి జన్మస్థానం.

ఆ సమావేశంలోకి ప్రవేశించిన వార్తాహరుడు చాల ఆయాసపడుతూ నిలబడిపోయాడు. ముందుగా చేయవలసిన జయజయధ్వానాలు కూడ మర్చిపోయాడు.....................

  • Title :Andhra Satavahanula Aswamethayagamu
  • Author :Kavikondala Chadradaram
  • Publisher :Navodaya Book House
  • ISBN :MANIMN4750
  • Binding :Papar Back
  • Published Date :2015 firtst print
  • Number Of Pages :267
  • Language :Telugu
  • Availability :instock