జలం జీవులకు జీవం ప్రసాదిస్తుంది. కాబట్టి దానిని జీవామృతం అంటారు. జీవాన్ని ఇవ్వటమే కాదు జీవుల పుట్టుకకు, వాటి మనుగడకు కూడా అదే కారణం. విజ్ఞానం విస్తరించినంతవరకు ఈ అనంతవిశ్వములో మన పుడమి మీద తప్ప ఏ ఇతర గ్రాహం మీద కూడా జీవరాశి గాని, దాని పుట్టుకకు కారణమైన జలరాశిగాని వున్న దాఖలా లేదు. పుడమి మీద ప్రాణికోటి పుట్టుకకు కారణమైన ఈ జలం మరమాత్మ మనకు ప్రసాదించిన ఓ ప్రవహించే వరం. అటువంటి నదులు - వాగులు గురించి తెలుసుకోవటానికి ఈ పుస్తకం చదవగలరు. |