“ఇందాకే చెప్పాను.. మా అమ్మ చచ్చిపోయిందని” ఒక్కో పదాన్ని కసిగా వత్తిపలుకుతూ అన్నాడు. ఆ
“అంత నిర్దయగా మాట్లాడటానికి మనసెలా ఒప్పింది బాబూ? ఇన్నేళ్ళ తర్వాత నిన్ను చూడాలని గంపెడాశతో వచ్చిన అమ్మతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?” ఆమె ఏడుస్తూ అంది.
అతనికి అమ్మంటే ఎందుకంత అసహ్యం?
“జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, పెరగడం, పెళ్ళీ పిల్లలు, వార్ధక్యం , మరణం.. ఇదేనా జీవితం? నిజంగా దేవుడున్నాడా? అతనే మనుషుల నుదుట రాతలు రాస్తాడా? నా నుదుట ఇలాంటి రాత ఎందుకు రాశాడు?” | ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం కోసం అతను చేసిన అన్వేషణే ఈ నవల.
“ఎన్ని రకాల దుర్గంధాల్ని ఈ గాలి తనలో విలీనం చేసుకుంటుందో గదా. ఆ నిప్పు చూశావా.. ఎన్నిటిని తనలో ఐక్యం చేసుకుంటుందో... ఈ నదిలోని నీళ్ల? అందుకే మనం గాలిని, నీటిని, నిప్పుని, మట్టిని దేవుళ్ళుగా భావించి పూజిస్తాం. దేవుడంటే అదే. దేన్నైనా ప్రేమగా తన బాహువుల్లోకి తీసుకుని ఐక్యం చేసుకునేది ఏదైనా, ఎవరైనా దేవుడే” అన్నాడు శివానంద్....
“మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేనితో అనుబంధం పెంచుకుంటామో అదే చివరికి మన దుఃఖానికి, అశాంతికి హేతువౌతుంది. ఏ సుఖమైనా, ఎంత ఆనందాన్నిచ్చేదైనా కొన్నాళ్ళకు విసుగు పుట్టిస్తుంది. శాశ్వతానందాన్ని కలిగించేది ఆత్మజ్ఞానం ఒక్కటే” అని బోధించిన శివానంద్ ఎవరు?
ప్రముఖ రచయిత శ్రీ సలీం సృజించిన 'అన్వేషణ' నవల చదవండి.