కడుపు తీపి
పుట్టకముందుకు కడుపులో - పెట్టుకొని మోసింది
పుట్టిన తరువాత వీపున - కట్టుకొని మోస్తుంది.
తన నుంచి విడిపోయి - ప్రపంచంలోకి వచ్చినా
తన రక్తాన్ని పాలగామార్చి - నిన్ను సాకింది
మిన్ను విరిగి - తన మీద పడ్డా
చిన్న ఇటుక పెళ్ళ కూడా నీ మీద పడకుండా
కంటికి రెప్పలా - భద్రంగా కాపాడుతుంది
అందుకే అమ్మఒడి - నీకు శ్రీరామరక్ష
పెరిగి పెద్దయిన - తరువాత
తల్లిని ఆదరించినా - అనాదరించినా
మరో బిడ్డకు - జన్మ ప్రదాతవై
స్వార్థంలేని ప్రేమతో - ప్రాణానికి ప్రాణంగా పెంచి
నీ కన్న తల్లిఋణం - తీర్చుకో
ఇదే మానవాళి - మనుగడకు
ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం - కడుపుతీపి