అక్కినేనికి నివాళిగా...
తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైన కొద్ది కాలానికే, అక్కినేని నటజీవితం కూడా ప్రారంభమై సుదీర్ఘ కాలం కొనసాగి మరణంతోనే ఆగిపోయింది. నాటకరంగం, సినిమారంగం మొత్తం కలిపి సుమారు 75 సంవత్సరాలు అక్కినేని నాగేశ్వరరావు. నటజీవితంలో వున్నారు. ఈ ఘనత తెలుగు నేలపై ఒక్క అక్కినేనికే సొంతం. బహుశా భారతదేశ చరిత్రలో కూడా మరొకరు వుండివుండరు. తెలుగు చలనచిత్ర మేటి నటులలో ఒకరైన అక్కినేని ఫోటోలు, కొన్ని ముఖ్య విషయాలతో కూడిన ఒక పుస్తకాన్ని, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విడుదల చేయాలని సంకల్పించి నాకు ఆ బాధ్యతను అప్పగించిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారికి కృతజ్ఞతలు. ఎంతోమంది మహానుభావులు అక్కినేనిపై రాసిన పుస్తకాలు, పత్రికలలోని వ్యాసాలు, అక్కినేని స్వయంగా రాసుకున్న విషయాల ఆధారంగా ఆయన జీవితపు తొలి రోజులలోని కొన్ని విషయాలు, చిత్రాలు మీతో పంచుకుంటున్నాము. అడిగిన వెంటనే అద్భుతమైన పద్య సందేశం పంపిన అవధాని, ప్రవచనకారుడు పద్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారికి, 'కళాసాగర్' వ్యవస్థాపక అధ్యక్షులు డా. సి. ముద్దుకృష్ణారెడ్డి (సి.యం.కె.రెడ్డి) గారికి. పద్య సందేశం పంపిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారికి, ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన అక్కినేని కుమార్తె నాగసుశీలగారికి, మనవరాలు యార్లగడ్డ సుప్రియగారికి, అక్కినేని స్వయంగా పాడిన పాటల వివరాలు అందజేసిన కాసరనేని చంద్రశేఖరరావు గారికి (ఉయ్యూరు), అక్కినేనికి సంబంధించిన ఎన్నో వివరాలు అందించి సహాయపడిన అక్కినేని అభిమాని బి. లక్ష్మీభవానిగారికి, చలసాని ప్రశాంతిగారికి, పుస్తకాన్ని అందంగా రూపొందించిన యం. వేణుగోపాల శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
చక్కటి ముఖ చిత్రాన్ని, మరికొన్ని అద్భుత చిత్రాలను అందించిన మిత్రులు రాపర్ల వినోద్ చౌదరికి కృతజ్ఞతలు. అద్భుతమైన ఫోటోలు అందించిన మనసు ఫౌండేషన్ మన్నం వెంకటరాయుడుగారికి, ఈ పుస్తకం రూపకల్పన బాధ్యతలు నాకు అప్పగించిన తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
శతవసంతాల అక్కినేనికి నివాళిగా ఈ చిరు జ్ఞాపికను మీ ముందుకు తీసుకువస్తున్నాము. శతజయంతి వేడుకల సందర్బముగా అక్కినేని అభిమానులకు శుభాకాంక్షలు.....................