• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Antarani Jathula Charitra

Antarani Jathula Charitra By Bonigala Ramarao

₹ 200

             ఆధునిక భారతదేశంలో అష్టకష్టాలు పడుతూ ఆకలి, పేదరికం, అజ్ఞానం, మూఢ నమ్మకాలతో జీవనం సాగిస్తున్న అంటరాని జాతులు, ఒకనాడు ఈ దేశంలో అత్యున్నత దశ అనుభవించిన వారే! వారే ఈ భూమి పుత్రులు, అనాది పాలక జాతులు. ఈ ఆదివాసుల, వేల సంవత్సరాల నాటి సంప్రదాయం, వారసత్వం, ఆ జాతులలో ఈ నాటికీ అచేతనంగా అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తుంది? ఆ జాతుల ఉమ్మడి సంస్కృతి, ఆ కులాల 'ఉమ్మడి జాతి ఆత్మ' ఆ జాతి యొక్క రాజకీయ - సాంస్కృతికి నైతిక తాత్విక విజయాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది? అనే విషయం చర్చించాల్సి యుంటుంది. అంటరాని జాతుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భౌతిక వనరుల కంటే కూడా, వారి వారసత్వం, భాషాతత్వం, సంస్కృతి, మతం మొదలైనవి ఎక్కువ ప్రభావం చూపినవి. అంటరాని జాతులు ఆర్థికంగా పతనమయినప్పటికీ వారి సంస్కృతిని, సంఘ దృక్పథాన్ని ఎలా కాపాడుకుంటూ పచ్చినవి అనే విషయాన్ని పరిగణలోనికి తీసుకొనకుండా చారిత్రక పరిశోధనలు ఎన్ని చేసినా వ్యర్థమే!

             "అంటరాని జాతుల చరిత్ర" కథ కాదు, కల్పన కాదు, పురాణం కాదు, ఇది చరిత్ర. దీనిని చారిత్రక దృక్పథంలో చూడాలి. మన దేశ చరిత్ర మొత్తము, వాస్తవ - అవాస్తవాల మిశ్రమము అనే విషయము మన మెరిగినదే. అయితే మన దేశ చరిత్ర వ్రాసిన చరిత్రకారుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. చరిత్రలో కొన్ని విషయాలు, సంఘటనలకు ఆధారాలు లభించుట లేదు. 

                                                                                                                      - బొనిగల రామారావు 

  • Title :Antarani Jathula Charitra
  • Author :Bonigala Ramarao
  • Publisher :Mourya Publications
  • ISBN :MANIMN0460
  • Binding :Paperback
  • Published Date :2017
  • Number Of Pages :256
  • Language :Telugu
  • Availability :instock