ఒక విస్ఫోటనపు ఉల్క దూసిన ఉప్పెన
తీరాలు దాటి
నిలువెల్లా ఎగిసి
నవ్య పరిణతులు పల్లవించింది.
ఆమని పురుడుపోసుకుని
సృజన వైవిధ్యంగా వర్ధిల్లుతుండగా
తృటిపాటి విలాసపు ఉచ్ఛ్వాస
నిర్జీవ గీతానికి తొలిస్వరం
పలికింది.
అది క్రమంగా కృతిగా సాగిపోయి
శిలాజాలను మలిచి
పూర్తి శకాన్నే చెరిపింది.
ఏది ప్రమాదం ?
ఏది ప్రమాదం ?.............