వీడని బంధాలు
మొదటి భాగం
ఈ మధ్య రాఘవకు చాలా ఆశ్చర్యంగా వుంటుంది. తన దేశాన్ని, తన ఊరిని, తన వాళ్ళను వదిలేసి అమెరికాకు వచ్చి ఇప్పటికి పాతికేళ్ళు అయ్యింది. ఏనాడో తాను వదిలేసిన తన వాళ్ల పాత జ్ఞాపకాలు కూడా అడుగున పడ్డాయి. కనీస సమాచారం వాళ్ల నుండి రాకుండ జాగ్రత్త పడ్డాడు. తన ఉనికిని కూడా బయటకు తెలియకుండా చాలా కష్టపడ్డాడు.
అలాంటిది, తన కొడుకు మాధవ్ని చూస్తుంటే భయం వేస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగినా కూడా చిన్నప్పటి నుండీ చదువుతో పాటు మొక్కలు, మట్టి, వ్యవసాయం అంటున్నాడు. ఈ మధ్య చదువులో కూడా కంప్యూటర్ చదువులు కాకుండా వ్యవసాయ సైన్స్ తీసుకున్నాడు. ఎప్పుడూ ఫార్మ్ హౌసుల చుట్టూ తిరుగుతాడు.
వాడిలో, వాడి మాటల్లో, చేతల్లో ప్రతీ క్షణం తాను మరిచిపోయిన, వద్దనుకొని వదిలి వచ్చిన తన తండ్రి రామయ్య కనిపిస్తున్నాడు రాఘవకు. ప్రస్తుతానికి రాఘవకు అదే భయం పట్టుకుంది. అదే ఆలోచన చుట్టుకుంది. డాలర్ల ఆశకు తాను రెక్కలు కట్టుకొని ఎగిరొస్తే, కొడుకుకు ఆ ఆశ లేదు, సుఖాల మీద ధ్యాస లేదు. డబ్బుకు విలువివ్వడు. భూమి, మొక్కలు, పంటలు తప్ప వేరే ఏదీ మాట్లాడడు. వాటికి తప్ప దేనికీ ప్రాధాన్యత చూపడు...............